Breaking News

ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్‌ విడుదల

Published on Mon, 03/31/2025 - 07:21

ఈ ఏడాది చివర్లో భారత క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు అక్టోబర్‌ 19న ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది హోం సమ్మర్‌ షెడ్యూల్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా నిన్న (మార్చి 30) విడుదల చేసింది. ఈసారి హోం సమ్మర్‌లో ఆస్ట్రేలియా ప్రతి రాష్ట్రాన్ని, టెరిటరీని కవర్‌ చేస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

భారత్‌తో సిరీస్‌లకు ముందు ఆస్ట్రేలియా సౌతాఫ్రికాకు ఆతిథ్యమివ్వనుంది. సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాతో  3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఆగస్ట్‌ 10న ఈ సిరీస్‌లు ప్రారంభం​ కానున్నాయి. ఈ సిరీస్‌లతో డార్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మైదానం పునఃప్రారంభం కానుంది. 17 ఏళ్ల క్రితం ఈ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడారు. 2008లో ఈ మైదానం బంగ్లాదేశ్‌ను హోస్ట్‌ చేసింది. డార్విన్‌లో ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో తొలి రెండు టీ20లు ఆడనుంది. ఆతర్వాత మూడో టీ20, తొలి వన్డే కెయిన్స్‌లో జరుగనున్నాయి. చివరి రెండు వన్డేలు మెక్‌కేలో జరుగుతాయి.

సౌతాఫ్రికాతో సిరీస్‌ల తర్వాత ఆసీస్‌ భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతుంది. ఈ రెండు సిరీస్‌లకు మధ్య దాదాపు రెండు నెలల గ్యాప్‌ ఉంది. భారత్‌తో సిరీస్‌ల అనంతరం ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే విడుదల చేశారు. నవంబర్‌ 21న తొలి యాషెస్‌ టెస్ట్‌ పెర్త్‌లో జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ను దృ​ష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా, భారత్‌లతో టీ20 సిరీస్‌లను ప్లాన్‌ చేసింది.

ఆస్ట్రేలియాలో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్‌..

ఆగస్ట్‌ 10- తొలి టీ20- డార్విన్‌
ఆగస్ట్‌ 12- రెండో టీ20- డార్విన్‌
ఆగస్ట్‌ 16- మూడో టీ20- కెయిన్స్‌

ఆగస్ట్‌ 19- తొలి వన్డే (డే అండ్‌ నైట్‌)- కెయిన్స్‌
ఆగస్ట్‌ 22- రెండో వన్డే (డే అండ్‌ నైట్‌)- మెక్‌కే
ఆగస్ట్‌ 24- మూడో వన్డే (డే అండ్‌ నైట్‌)- మెక్‌కే

ఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటన షెడ్యూల్‌..

అక్టోబర్‌ 19- తొలి వన్డే (డే అండ్‌ నైట్‌)- పెర్త్‌
అక్టోబర్‌ 23- రెండో వన్డే (డే అండ్‌ నైట్‌)- అడిలైడ్‌
అక్టోబర్‌ 25- మూడో వన్డే (డే అండ్‌ నైట్‌)- సిడ్నీ

అక్టోబర్‌ 29- తొలి టీ20- కాన్‌బెర్రా
అక్టోబర్‌ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌
నవంబర్‌ 2- మూడో టీ20- హోబర్ట్‌
నవంబర్‌ 6- నాలుగో టీ20- గోల్డ్‌ కోస్ట్‌
నవంబర్‌ 8- ఐదో టీ20- బ్రిస్బేన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)