Breaking News

రాహుల్‌ ద్రవిడ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Published on Wed, 02/05/2025 - 11:11

టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు (Rahul Dravid) తృటిలో ప్రమాదం తప్పింది. నిన్న (ఫిబ్రవరి 4) బెంగళూరులో రాహుల్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రాహుల్‌కు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. నిన్న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని ఓ బిజీ రోడ్డులో (కన్నింగ్హమ్‌ రోడ్‌) రాహుల్‌ ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం ద్రవిడ్‌ ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

ఈ ప్రమాదంలో రాహుల్‌ కారుకు స్వల్ప డ్యామేజీ అయ్యింది. ఇందుకే ద్రవిడ్‌ ఆటో డ్రైవర్‌తో వాదనకు దిగాడు. ద్రవిడ్‌.. తన మాతృభాష కన్నడలో ఆటో డ్రైవర్‌పై అసహనాన్ని ప్రదర్శిం​చాడు. ఘటన స్ధలం నుంచి బయల్దేరేముందు ద్రవిడ్‌ సదరు ఆటో డ్రైవర్‌ వివరాలు తీసుకున్నాడు. అయితే అతనిపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు. ఎప్పుడూ కూల్‌గా కనిపించే ద్రవిడ్‌ నడి రోడ్డుపై ఓ ఆటో డ్రైవర్‌తో వాదనకు దిగడం క్రికెట్‌ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

52 ఏళ్ల రాహుల్‌ ద్రవిడ్‌.. తన 16 ఏళ్ల కెరీర్‌లో మైదానంలో గొడవలు పడిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ప్రత్యర్థులు రెచ్చిగొడితే రాహుల్‌ తన బ్యాట్‌తో సమాధానం చెప్పేవాడు కానీ ఎప్పుడూ గొడవకు దిగేవాడు కాదు. అలాంటి ద్రవిడ్‌ ఓ ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగడంపై ప్రస్తుతం నెట్టింట చర్చ నడుస్తుంది.

ఇదిలా ఉంటే, ద్రవిడ్‌ హెడ్‌ కోచ్‌గా ఉండగా భారత్‌ 2024 టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌కు అదే చివరి టోర్నమెంట్‌. టీమిండియా కోచింగ్‌ బాధ్యతల నుంచి వైదొలిగాక ద్రవిడ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ హెడ్‌ కోచ్‌గా రీ జాయిన్‌ అయ్యాడు. ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో రాహుల్‌ తనదైన మార్కును చూపించాడు. ఆ వేలంలో ద్రవిడ్‌ సూచనలతో రాయల్స్‌ 13 ఏళ్ల యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీని దక్కించుకుంది. వైభవ్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 
 

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)