Breaking News

వార్షిక ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న టీమిండియా

Published on Mon, 05/05/2025 - 14:51

ఐసీసీ వార్షిక పరిమిత ఓవర్ల ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌ భారత పురుషుల క్రికెట్‌ జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్స్ గతేడాది మే నుండి జరిగిన అన్ని  మ్యాచ్‌లను 100 శాతంగా, గత రెండు సంవత్సరాల్లో జరిగిన మ్యాచ్‌లను 50 శాతంగా పరిగణలోకి తీసుకుని నిర్ణయించబడ్డాయి. 

ప్రస్తుత వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా.. వార్షిక ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది. గడిచిన రెండేళ్లలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్న టీమిండియా.. గతేడాది టీ20 ప్రపంచకప్‌, ఈ ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.  

తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ రెండు పాయింట్లు మెరుగుపర్చుకుని పాయింట్ల సంఖ్యను 122 నుంచి 124కు పెంచుకుంది. భారత్‌ తర్వాత రెండో స్థానంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ రన్నరప్‌ న్యూజిలాండ్‌ ఉంది. న్యూజిలాండ్‌.. వన్డేల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరుకుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆసీస్‌ మూడో స్థానానికి పడిపోయింది.

ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ల్లో భారత్‌, ఆసీస్‌కు ఓడించిన శ్రీలంక ఐదు రేటింగ్‌ పాయింట్లు మెరుగుపర్చుకుని తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. పాకిస్తాన్‌, సౌతాఫ్రికా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. 

గత రెండేళ్లలో మెరుగైన ప్రదర్శనలు చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ రేటింగ్‌ పాయింట్లు పెంచుకుని ఏడో స్థానానికి ఎగబాకగా.. మాజీ వరల్డ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నాయి.

మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్‌ హవా కొనసాగింది. ప్రస్తుత టీ20 ఛాంపియన్స్‌ అయిన భారత్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. ఆసీస్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వరుస స్థానాల్లో నిలిచాయి.

టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా
ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత డబ్ల్యూటీసీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా టాప్‌ ప్లేస్‌ను దక్కించుకుంది. ఆసీస్‌ రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ కంటే 13 పాయింట్లు అధికంగా సాధించింది. 

ఈ దఫా డబ్ల్యూటీసీ ఫైనల్లో​ ఆసీస్‌ను ఎదుర్కోబోయే సౌతాఫ్రికా మూడో స్థానంలో నిలిచింది. ఇటీవల న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా చేతుల్లో పరాజయాల నేపథ్యంలో భారత్‌ నాలుగో స్థానానికి దిగజారింది. న్యూజిలాండ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌ టాప్‌-10లో ఉన్నాయి. 

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)