ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
మరోసారి తండ్రైన టీమిండియా క్రికెటర్
Published on Wed, 05/28/2025 - 20:56
టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ మరోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య రిన్నీ కంతారియా ఈ నెల 18న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉనద్కత్ ఇవాళ (మే 28) సాయంత్రం సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు. ఉనద్కత్, రిన్నీ 2021లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023 డిసెంబర్లో జేడన్ (మగబిడ్డ) జన్మించాడు.
👼🏻❤️ pic.twitter.com/Maoc5AbA3h
— Jaydev Unadkat (@JUnadkat) May 28, 2025
33 ఏళ్ల ఉనద్కత్ ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు. ఈ సీజన్లో అతను 7 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఉనద్కత్ రంజీల్లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఆ జట్టుకు అతను కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నాడు. అతని సారథ్యంలో సౌరాష్ట్ర 2020లో రంజీ ట్రోఫీ గెలిచింది. ఇది ఆ జట్టుకు తొలి టైటిల్.
2010లో టీమిండియా అరంగేట్రం చేసిన ఉనద్కత్.. మధ్యలో చాలాకాలం జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. 15 ఏళ్లలో అతను టీమిండియా తరఫున 4 టెస్ట్‌లు, 8 వన్డేలు, 10 టీ20లు మాత్రమే ఆడాడు. ఇందులో 26 వికెట్లు తీశాడు.
ఐపీఎల్లో ఉనద్కత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లోనూ 2010లోనే కెరీర్ ప్రారంభించిన ఉనద్కత్.. ఇప్పటివరకు వివిధ ఫ్రాంచైజీల తరఫున 112 మ్యాచ్‌లు ఆడి 110 వికెట్లు తీశాడు.
Tags : 1