Breaking News

క్వార్టర్స్‌లో తరుణ్‌

Published on Fri, 12/12/2025 - 01:29

కటక్‌: ఒడిశా మాస్టర్స్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్, టాప్‌ సీడ్‌ తరుణ్‌ మన్నేపల్లి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్‌ తరుణ్‌ 21–16, 12–21, 21–11తో భారత్‌కే చెందిన గోవింద్‌ కృష్ణపై గెలుపొందాడు. 

భారత్‌కే చెందిన కిరణ్‌ జార్జి, రిత్విక్‌
సంజీవి, శంకర్‌ ముత్తుస్వామి, రౌనక్‌ చౌహాన్‌ కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో శంకర్‌ 21–8, 19–21, 21–15తో ఆర్య (భారత్‌)పై, కిరణ్‌ జార్జి 21–12, 21–18తో డెండి ట్రియాన్సి (ఇండోనేసియా)పై, రిత్విక్‌ 15–21, 21–6, 21–17తో సిద్ధాంత్‌ గుప్తా (భారత్‌)పై, రౌనక్‌ 21–18, 19–21, 21–17తో వరుణ్‌ కపూర్‌పై గెలుపొందారు.  

శ్రియాన్షి పరాజయం 
మహిళల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్‌ శ్రియాన్షి వలిశెట్టి పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. శ్రియాన్షి 18–21, 18–21తో తాన్యా హేమంత్‌ (భారత్‌) చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన ఉన్నతి హుడా, అనుపమ, తస్నిమ్‌ మీర్, తన్వీ శర్మ, అన్‌మోల్, ఇషారాణి బారువా కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. 

పురుషుల డబుల్స్‌ విభాగంలో అరిగెల భార్గవ్‌ రామ్‌–గొబ్బూరి విశ్వతేజ్‌ (భారత్‌) జోడీ క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భార్గవ్‌ రామ్‌–విశ్వతేజ్‌ ద్వయం 18–21, 24–22, 21–17తో నితిన్‌–వీరంరెడ్డి వెంకట హర్షవర్ధన్‌ నాయుడు (భారత్‌) జంటపై గెలిచింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)