Breaking News

స్టార్‌ క్రికెటర్‌ షాకింగ్‌ నిర్ణయం.. అర్ధాంతరంగా రిటైర్మెంట్‌! వరల్డ్‌కప్‌కు ముందు

Published on Thu, 07/06/2023 - 13:34

బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌, ఆ దేశ వన్డే జట్టు కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకు​న్నాడు. వరల్డ్‌కప్‌కు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డును కోరాడు. తమీమ్‌ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం క్రికెట్‌ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

నిన్న (జులై 5) స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన తమీమ్‌.. తన సన్నిహితులకు కూడా సమాచారం ఇవ్వకుండా రిటైర్మెంట్‌ ప్రకటన చేసినట్లు తెలుస్తుంది. తమీమ్‌ ఆకస్మిక నిర్ణయానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 34 ఏళ్ల తమీమ్‌ తన 16 ఏళ్ల కెరీర్‌ను అర్ధంతరంగా ముగించడంతో బంగ్లాదేశ్‌ అభిమానులు అవాక్కవుతున్నారు. 

బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడిన తమీమ్‌.. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ  ఇచ్చాడు. లెఫ్ట్‌ హ్యాండ్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ అయిన తమీమ్‌.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలో తమీమ్‌ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)