Breaking News

తమిళ్‌ తలైవాస్‌ తడాఖా

Published on Sat, 12/07/2024 - 04:09

పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో తమిళ్‌ తలైవాస్‌ జట్టు ఆరో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన తలైవాస్‌ 40–27 పాయింట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది. తలైవాస్‌ తరఫున మోయిన్‌ షఫాఘి 13 పాయింట్లతో సత్తా చాటగా... సౌరభ్, హిమాన్షు చెరో 7 పాయింట్లు సాధించారు. గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున హిమాన్షు 11 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. 

తాజా సీజన్‌లో 16 మ్యాచ్‌లాడిన తమిళ్‌ తలైవాస్‌ 6 విజయాలు, 9 పరాజయాలు, ఒక ‘టై’తో 38 పాయింట్లు సంపాదించింది. ప్రస్తుతం తలైవాస్‌ తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు గుజరాత్‌ 16 మ్యాచ్‌ల్లో పదో పరాజయం మూటగట్టుకుంది. శుక్రవారమే జరిగిన రెండో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 42–36 తేడాతో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. హరియాణా జట్టు తరఫున శివమ్‌ 11 పాయింట్లు, మొహమ్మద్‌ రెజా 9 పాయింట్లు సాధించగా.. సంజయ్‌ ధుల్, వినయ్‌ చెరో 5 పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. 

పట్నా తరఫున దేవాంక్‌ 13 పాయింట్లతో పోరాడాడు. ఓవరాల్‌గా ఇరు జట్లు రెయిడింగ్‌లో చెరో 19 పాయింట్లు సాధించగా... డిఫెన్స్‌లో సత్తా చాటిన స్టీలర్స్‌ విజాయన్ని ఖరారు చేసుకుంది. ఈ సీజన్‌లో 17 మ్యాచ్‌లాడిన స్టీలర్స్‌ 13 విజయాలు, 4 పరాజయాలతో 67 పాయింట్లు సాధించింది. తమ అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. పట్నా పైరేట్స్‌ 53 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 

నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో పుణేరి పల్టన్‌ (రాత్రి 8 గంటలకు), తెలుగు టైటాన్స్‌తో బెంగాల్‌ వారియర్స్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)