Breaking News

తమిళ్‌ తలైవాస్‌ అవుట్‌

Published on Mon, 12/16/2024 - 03:06

పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో తమిళ్‌ తలైవాస్‌ జట్టు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి బయటకు వచ్చింది. ఈ సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న తలైవాస్‌... ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 27–34 పాయింట్ల తేడాతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ చేతిలో ఓడింది. తమిళ్‌ తలైవాస్‌ తరఫున హిమాన్షు, నితీశ్‌ కుమార్‌ చెరో 7 పాయింట్లతో రాణించగా... పింక్‌ పాంథర్స్‌ తరఫున అర్జున్‌ దేశ్వాల్, నీరజ్‌ నర్వాల్‌ చెరో 6 పాయింట్లు సాధించారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పింక్‌ పాంథర్స్‌ 13 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... తలైవాస్‌ 7 రెయిడ్‌ పాయింట్లకే పరిమితమై పరాజయం మూటగట్టుకుంది. తాజా సీజన్‌లో 19 మ్యాచ్‌లాడిన తలైవాస్‌ 6 విజయాలు, 12 పరాజయాలు, ఒక ‘టై’తో 40 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. పీకేఎల్‌ ముగింపు దశకు చేరుకుంటుండగా... మిగిలిన అన్నీ మ్యాచ్‌ల్లో గెలిచినా... తలైవాస్‌ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం లేదు. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 19 మ్యాచ్‌ల్లో 10 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 59 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 30–27 పాయింట్ల తేడాతో యూ ముంబాపై విజయం సాధించింది. ఈ సీజన్‌లో 19 మ్యాచ్‌లాడిన యూపీ యోధాస్‌ 10 విజయాలు, 6 పరాజయాలు, 3 ‘టై’లతో 64 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో దబంగ్‌ ఢిల్లీతో బెంగాల్‌ వారియర్స్‌ (రాత్రి 8 గంటలకు), పట్నా పైరేట్స్‌తో పుణేరి పల్టన్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.   

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు