‘బంగారం’లాంటి ఆటను వదిలి...

Published on Sat, 03/08/2025 - 04:25

లండన్‌: జేడ్‌ జోన్స్‌... బ్రిటన్‌ ప్రొఫెషనల్‌ తైక్వాండో ప్లేయర్‌. అంతేకాదు! స్వదేశంలో జరిగిన 2012 లండన్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో... 2016 రియో ఒలింపిక్స్‌ క్రీడల్లో... మహిళల తైక్వాండో ఈవెంట్‌లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. తదనంతరం 2020 టోక్యో, 2024 పారిస్‌ విశ్వక్రీడల్లోనూ జేడ్‌ పాల్గొంది. 2010లో యూత్‌ ఒలింపిక్స్‌ స్వర్ణం మొదలు, ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్, యూరోపియన్‌ గేమ్స్, యూరోపియన్‌ చాంపియన్‌షిప్, గ్రాండ్‌ప్రి ఈవెంట్లలో 36 (19 స్వర్ణాలు, 11 రజతాలు, 6 కాంస్యాలు) పతకాలు గెలుచుకుంది. 

జేడ్‌ జోన్స్‌ పతకాల సంఖ్య ఆమె వయసు (31 ఏళ్లు)ను ఎప్పుడో మించిపోయింది. బహుశా ‘కిక్‌’ కొడితే పతకాలు రాలుతున్న తైక్వాండో క్రీడాంశం బోర్‌ కొట్టించిదేమో తెలియదు కానీ ఈ బ్రిటన్‌ క్రీడాకారిణి  ఇప్పుడు కొత్త ‘పంచ్‌’కు సిద్ధమైంది. బాక్సింగ్‌ను తెగ ఇష్టపడటం వల్లే 20 ఏళ్ల తర్వాత కొత్త కెరీర్‌లోకి అడుగుపెడుతున్నట్లు జోన్స్‌ చెప్పింది. రింగ్‌లో ఆమె అపుడే లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది. 

‘ఇప్పటికే తైక్వాండోలో ప్రపంచ చాంపియన్‌ అయ్యాను. త్వరలో బాక్సింగ్‌లోనూ ప్రపంచ చాంపియన్‌ కావాలని ఆశిస్తున్నాను. రెండు వేర్వేరు క్రీడల్లో ఈ ఘనత సాధిస్తే గొప్పగా ఉంటుంది కదూ’ అని చెప్పింది. బ్రిటిష్, కామన్వెల్త్‌ ఫెదర్‌వెయిట్‌ మాజీ చాంపియన్‌ స్టీఫెన్‌ స్మిత్‌ కోచింగ్‌లో తీవ్రస్థాయిలో కసరత్తులు కూడా చేస్తోంది.

అయితే మూడు పదుల వయసు దాటిన తర్వాత పూర్తిగా కొత్త క్రీడలో పతకాలు సాధించడం పెద్ద సవాల్‌ అని చెప్పొచ్చు. 19 ఏళ్ల టీనేజ్‌లోనే జోన్స్‌ లండన్‌ విశ్వక్రీడల్లో బంగారు పతకం గెలిచింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ‘రియో’లో నిలబెట్టుకుంది. 

#

Tags : 1

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)