Breaking News

సౌతాఫ్రికా క్రికెటర్‌ షంసీ కీలక నిర్ణయం

Published on Thu, 10/03/2024 - 15:42

సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ తబ్రేజ్‌ షంసీ సెంట్రల్‌ కాంట్రాక్టు నుంచి వైదొలిగాడు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంఛైజీ క్రికెట్‌లో భాగమయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అయితే, జాతీయ జట్టుకు తన సేవలు అవసరమైన వేళ తప్పకుండా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు నిర్ధారించింది.

అందుకే  ఈ నిర్ణయం
‘‘సెంట్రల్‌ కాంట్రాక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ సమయంలో కాస్త విరామంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్‌ మ్యాచ్‌లు ఆడాలని కోరుటుకుంటున్నాను. నా కుటుంబానికి తగినంత సమయం కేటాయించాలని భావిస్తున్నాను.

అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే, ప్రొటిస్‌ జట్టుకు నా అవసరం ఉందనుకున్న సమయంలో బోర్డు పిలిస్తే కచ్చితంగా దేశానికి ఆడతా’’ అని తబ్రేజ్‌ షంసీ పేర్కొన్నాడు. కాగా 2016లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన తబ్రేజ్‌ షంసీ.. వన్డే, టీ20 జట్టలో ఫస్ట్‌ ఛాయిస్‌ స్పిన్నర్‌గా ఎదిగాడు.

ఇప్పటి వరకు సౌతాఫ్రికా తరఫున 51 వన్డేలు, 70 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 72, 89 వికెట్లు పడగొట్టాడు. అయితే, టెస్టుల్లో మాత్రం షంసీ నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం రెండే మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు తీయగలిగాడు.

సెంట్రల్‌ కాంట్రాక్టు లేకపోయినా
ఇక షంసీ నిర్ణయాన్ని తాము ఆమోదిస్తున్నట్లు క్రికెట్‌ సౌతాఫ్రికా డైరెక్టర్‌ ఎనోచ్‌ తెలిపాడు. సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్లలో షంసీ కీలక సభ్యుడని.. సెంట్రల్‌ కాంట్రాక్టు లేకపోయినా సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని చెప్పడం అతడి నిజాయితీకి నిదర్శనమని ప్రశంసించాడు. 

కాగా షంసీ ఐపీఎల్‌తో పాటు మరెన్నో టీ20లలో భాగమవుతున్నాడు. చివరగా.. ఈ ఏడాది కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియాట్స్‌తో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

చదవండి: ధోని కంటే రోహిత్‌ బెటర్‌ కెప్టెన్‌: భారత స్పిన్‌ దిగ్గజం

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)