Breaking News

భారత క్రికెటర్ల వందేమాతర గీతాలాపన.. గూస్‌ బంప్స్‌ రావాల్సిందే..!

Published on Fri, 07/05/2024 - 09:07

టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌ 2024 సాధించిన నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా సంబురాలు జరుగుతున్నాయి. ఊరూ వాడా భారత క్రికెట్‌ జట్టు సాధించిన విజయాన్ని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. టీమిండియా 13 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్‌ సాధించడంతో అభిమానులతో పాటు భారత క్రికెటర్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. 

నిన్న (జులై 4) జరిగిన వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ పెరేడ్‌లో భారత ఆటగాళ్లు తమనుతాము మైమరిచిపోయి సంబురాల్లో మునిగిపోయారు. డ్యాన్స్‌లు, పాటలతో తెగ సందడి చేశారు. వాంఖడేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లను పట్టడానికి వీల్లేకుండా పోయింది. ప్రతి ఒక్క ఆటగాడు చిన్న పిల్లాడిలా మారిపోయి ఆనందంలో మునిగి తేలారు. 

వందేమాతర గీతాలపన సందర్భంగా భారత క్రికెటర్లు అభిమానులతో గొంతు కలపడం చూస్తే గూస్‌ బంప్స్‌ రావాల్సిందే. ఈ సందర్భంగా కోహ్లి, హార్దిక్‌ చాలా ఎమోషనల్‌ అయ్యారు. వీరిద్దరు దిక్కులు పిక్కటిల్లేలా వందేమాతర గీతాలాపన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోను ఎంతసేపు చూసినా చూడాలనిపించేలా ఉంది.

ఇదిలా ఉంటే, టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్‌ నిరీక్షణకు తెరదించుతూ యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌ విజయానంతరం భారత క్రికెట్‌ జట్టు నిన్న ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది. 

11 ఏళ్ల అనంతరం ఐసీసీ ట్రోఫీ సాధించడంతో భారత క్రికెట్‌ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్‌ పెరేడ్‌లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధులు భారత క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి. విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్‌ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. 

భారత క్రికెటర్లు ఓపెన్‌ టాప్‌ బస్‌ నుంచి జనాలకు అభివాదం చేశారు. విన్నింగ్‌ పెరేడ్‌ మెరైన్‌ రోడ్‌ గుండా వాంఖడే వరకు సాగింది. అనంతరం వాంఖడే స్టేడియంలో భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆథ్వర్యంలో సన్మానం​ జరిగింది. భారత​ క్రికెటర్లను, వరల్డ్‌కప్‌ను చూసేందుకు వాంఖడే స్టేడియంకు జనాలు పోటెత్తారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)