Breaking News

నమీబియాకు షాకిచ్చిన యూఏఈ.. సూపర్‌-12కు నెదర్లాండ్స్‌

Published on Thu, 10/20/2022 - 17:27

టీ20 ప్రపంచకప్‌-2022 క్వాలిఫియర్స్‌(గ్రూప్‌-ఎ)లో భాగంగా యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో నమీబియా  పరాజయం పాలైంది. తద్వారా టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి నమీబియా ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో నమీబియా ఓటమి పాలవ్వడంతో.. గ్రూప్‌-ఎ నుంచి నెదర్లాండ్స్‌ సూపర్‌-12లో అడుగుపెట్టింది. కాగా నమీబియా ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ వీస్‌ అఖరి వరకు పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.

149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 13 ఓవర్లు ముగిసే సరికి 67 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన వీస్‌(36 బంతుల్లో 55 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో నమీబియా గెలుపు ఆశలను పెంచాడు. అయితే అఖరి ఓవర్‌లో నమీబియా విజయానికి 14 పరుగులు అవసరమైన క్రమంలో వీస్‌ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్‌ యూఏఈ వైపు మలుపు తిరిగింది.

అఖరి ఓవర్‌లో నమీబియా కేవలం 7 పరుగులు మాత్రమే చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. యూఏఈ బౌలర్లలో హమిద్‌, జహూర్ ఖాన్ చెరో రెండు వికెట్లు సాధించగా.. వసీం, జునైద్ సిద్ధిక్, మెయ్యప్పన్ తలా వికెట్‌ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటర్లలో మహ్మద్‌ వసీం(50), రిజ్వాన్‌(43) పరుగులతో రాణించారు.


చదవండిPredicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్‌.. తుది జట్టు ఇదే! పంత్‌, అశ్విన్‌, హుడాకు నో ఛాన్స్‌!

Videos

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)