Breaking News

T20 World Cup 2024: పూర్వ వైభవం దిశగా వెస్టిండీస్‌

Published on Thu, 06/13/2024 - 18:18

ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన వెస్టిండీస్‌ వరుస విజయలతో దూసుకుపోతుంది. ఈ ఎడిషన్‌లో కరీబియన్‌ టీమ్‌ పపువా న్యూ గినియా, ఉగాండ, తాజాగా న్యూజిలాండ్‌పై ఘన విజయాలు సాధించి గ్రూప్‌-సి నుంచి సూపర్‌-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.

ఈ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన విండీస్‌.. హ్యాట్రిక్‌ విజయాలు సాధించి టైటిల్‌ ఫేవరెట్లలో ముందు వరుసలో నిలిచింది. ఈ టోర్నీకి ముందు విండీస్‌ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. జట్టులో అందరూ విధ్వంసకర వీరులే అయినప్పటికీ, ఆ జట్టు 2023 వన్డే వరల్డ్‌కప్‌కు, 2022 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయింది.

ప్రస్తుత ప్రపంచకప్‌లో విండీస్‌ మెరుపు ప్రదర్శనల వెనక ఆ జట్టు కోచ్‌ డారెన్ సామీ కీలకపాత్ర పోషిస్తున్నాడు. రెండు సార్లు (2012, 2016) విండీస్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన సామీ.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో కోచ్‌గా తన మార్కును చూపిస్తున్నాడు. సామీ ఆధ్వర్యంలో విండీస్‌ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. స్వదేశంలో ఆడుతుండటం విండీస్‌కు అదనంగా కలిసొస్తుంది.

ఇదిలా ఉంటే, సూపర్‌-8కు ఇదివరకే అర్హత సాధించిన వెస్టిండీస్‌ గ్రూప్‌ దశలో తమ తదుపరి మ్యాచ్‌ను జూన్‌ 19న ఆడనుంది. సెయింట్‌ లూసియా వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో కరీబియన్‌ టీమ్‌ ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. సూపర్‌-8 రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌.. సౌతాఫ్రికాను ఢీకొంటుంది. 
 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)