Breaking News

T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు

Published on Sat, 06/08/2024 - 21:50

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఇవాళ (జూన్‌ 8) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా పేసర్లు నిప్పులు చెరిగారు. ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ (4-0-11-4), అన్రిచ్‌ నోర్జే (4-0-19-2), మార్కో జన్సెన్‌ (4-0-20-2) ధాటి​కి నెదర్లాండ్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌.. సౌతాఫ్రికా పేసర్లు మూకుమ్మడిగా విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌లో సైబ్రాండ్‌ ఎంజెల్‌బ్రెట్చ్‌ (40), లొగాన్‌ వాన్‌ బీక్‌ (23) రాణించకపోయంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. 

నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌లో సైబ్రాండ్‌, వాన్‌ బీక్‌తో పాటు విక్రమ్‌జీత్‌ (12), స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లెవిట్‌ 0, మ్యాక్స్‌ ఓడౌడ్‌ 2, బాస్‌ డి లీడ్‌ 6, తేజ నిడమనూరు 0, టిమ్‌ ప్రింగిల్‌ 0, వాన్‌ మీకెరన్‌ 1 నాటౌట్‌ పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, కేశవ్‌ మహారాజ్‌లకు వికెట్లు దక్కనప్పటికీ పొదుపుగా బౌలింగ్‌ చేశారు. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన బార్ట్‌మన్‌ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

కాగా, గ్రూప్‌-డిలో భాగమైన సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ జట్లు ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. సౌతాఫ్రికా.. శ్రీలంకపై విజయం సాధించగా..నెదర్లాండ్స్‌.. నేపాల్‌ను మట్టికరిపించింది.

తుది జట్లు..

నెదర్లాండ్స్: మైకేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), బాస్ డి లీడే, తేజ నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, పాల్ వాన్ మీకెరెన్, వివియన్ కింగ్మా

దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్‌), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)