Breaking News

T20 World Cup 2024: 30 ఏళ్ల చరిత్రలో తొలిసారి..!

Published on Thu, 06/27/2024 - 14:01

సౌతాఫ్రికా జట్టు 30 ఏళ్ల తమ వరల్డ్‌కప్‌ చరిత్రలో తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. ప్రపంచకప్‌ టోర్నీల్లో ప్రొటీస్‌ ప్రస్తానం​ 1992 వన్డే వరల్డ్‌కప్‌ ఎడిషన్‌తో మొదలు కాగా.. తొలిసారి ఆ జట్టు సెమీస్‌ గండం దాటింది. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఇవాళ (జూన్‌ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేయడంతో సఫారీల మూడు దశాబ్దాల కల సారాకమైంది. 

సౌతాఫ్రికా 1992, 1999, 2007, 2015, 2023 వన్డే ప్రపంచకప్‌ ఎడిషన్లలో సెమీఫైనల్‌ వరకు చేరినా ఫైనల్‌కు చేరలేకపోయింది. పొట్టి ప్రపంచకప్‌లో ఆరంభ ఎడిషన్‌ నుంచి పాల్గొనినా రెండు సార్లు (2009, 2024) మాత్రమే అతికష్టం మీద సెమీస్‌కు చేరింది.

బలాబలాల పరంగా సౌతాఫ్రికా పటిష్టమైన జట్టే అయినా.. క్రికెట్‌ చరిత్రలో ఆ జట్టుకు అత్యంత దురదృష్టవంతమైన జట్టుగా పేరుంది. ఇనేళ్ల ఆ జట్టు చరిత్రలో ప్రతిసారి బలమైన జట్టుతోనే బరిలోకి దిగినప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఒక్క ఐసీసీ కూడా టైటిల్‌ (వరల్డ్‌కప్‌) గెలవలేకపోయింది. 

ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు చేరాలన్న ఆ జట్టు కలను ఎయిడెన్‌ మార్క్రమ్‌ సార్దకం చేశాడు. సౌతాఫ్రికాను వరల్డ్‌కప్‌ (టీ20) ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా మార్క్రమ్‌ రికార్డుల్లోకెక్కాడు. మార్క్రమ్‌కు అండర్‌-19 విభాగంలో సౌతాఫ్రికాకు తొలి ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్‌గానూ రికార్ంది. మార్క్రమ్‌ సెంటిమెంట్‌ తమకు మరోసారి రిపీట్‌ అవుతుందని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే, ట్రినిడాడ్‌ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య రెండో సెమీఫైనల్‌ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్‌-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్తుంది. రెండో సెమీఫైనల్స్‌కు రిజర్వ్‌ డే లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)