Breaking News

T20 World Cup 2024: ఓడినా రికార్డు నెలకొల్పారు..!

Published on Sun, 06/16/2024 - 13:52

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (జూన్‌ 16) జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల చరిత్రలో స్కాట్లాండ్‌ ఇదే అత్యధిక స్కోర్‌. 2022 ఎడిషన్‌లో ఐర్లాండ్‌పై చేసిన 176 పరుగులు ఈ మ్యాచ్‌ ముందు వరకు ఆ జట్టు అత్యధిక స్కోర్‌గా ఉండింది. నేటి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఓడినా రికార్డు నెలకొల్పింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. సూపర్‌-8కు చేరే క్రమంలో స్కాట్లాండ్‌కు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకమై ఉండింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే స్కాట్లాండ్‌ సూపర్‌-8కు చేరి ఉండేది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఓడటం.. నమీబియాపై ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించడంతో ఇంగ్లండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించింది. గ్రూప్‌-బి నుంచి ఇదివరకే ఆస్ట్రేలియా సూపర్‌-8కు క్వాలిఫై అయ్యింది.

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌.. బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ (60), బెర్రింగ్టన్‌ (42 నాటౌట్‌), మున్సే (35) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో మ్యాక్స్‌వెల్‌ 2, ఆస్టన్‌ అగర్‌, నాథన్‌ ఇల్లిస్‌, ఆడమ్‌ జంపా తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌.. ట్రవిస్‌ హెడ్‌ (68), మార్కస్‌ స్టోయినిస్‌ (59), టిమ్‌ డేవిడ్‌ (24 నాటౌట్‌) చెలరేగడంతో 19.4 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. స్కాట్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ వాట్‌, షరీఫ్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాడ్‌ వీల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి