T20 World Cup 2024: రషీద్ ఖాన్‌కు మందలింపు

Published on Thu, 06/27/2024 - 09:26

ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ను ఐసీసీ మందలించింది. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో బ్యాట్‌ను నేలకేసి కొట్టినందుకు గాను మందలింపుతో పాటు ఓ డీమెరిట్‌ పాయింట్‌ను ఫైన్‌గా విధించింది. 24 నెలల వ్యవధిలో రషీద్‌ చేసిన మొదటి తప్పిదం కావడంతో ఐసీసీ స్వల్ప చర్యలతో సరిపెట్టింది. బ్యాట్‌ను నేలకేసి కొట్టడం ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9ని ఉల్లంఘన కిందికి వస్తుంది. దీన్ని లెవెల్‌ 1 తప్పిదంగా పరిగణిస్తారు.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో రషీద్‌ బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. ఆ సందర్భంలో తన బ్యాటింగ్ భాగస్వామి కరీం జనత్ స్ట్రైక్‌ను తిరస్కరించినందుకు (రెండో పరుగు) రషీద్ బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ విజయం​ సాధించి సెమీఫైనల్‌కు చేరింది. అయితే సెమీస్‌లో ఆ జట్టుకు సౌతాఫ్రికా చేతిలో చుక్కెదురైంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘన్లు 56 పరుగుల స్వల్ప స్కోర్‌కు చాపచుట్టేయగా.. సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా సౌతాఫ్రికా తొలిసారి ప్రపంచకప్‌ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్‌కు చేరింది. 

ఇవాళే (జూన్‌ 27, రాత్రి 8 గంటలకు) జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్‌-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్తుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)