Breaking News

టీమిండియా బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడింది.. పాక్‌ మాజీ కెప్టెన్‌ సంచలన ఆరోపణలు

Published on Wed, 06/26/2024 - 10:57

టీమిండియాపై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ సంచలన ఆరోపణలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ అసాధారణమైన రివర్స్‌ స్వింగ్‌ను రాబట్టాడని ఇంజి ఆరోపించాడు.

అర్ష్‌దీప్‌ తన సెకెండ్‌ స్పెల్‌లో (16వ ఓవర్‌లో) కొత్త బంతితో రివర్స్‌ స్వింగ్‌ను ఎలా రాబట్టగలిగాడని ప్రశ్నించాడు. సహజంగా బంతి పాతబడ్డాక రివర్స్‌ స్వింగ్‌ అవుతుంది. అలాంటి​ది అర్ష్‌దీప్‌ కొత్త బంతితో రివర్స్‌ స్వింగ్‌ ఎలా రాబట్టాడని నిలదీశాడు. బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడకుండా ఆటగాళ్లపై కన్నేసి ఉంచాలని అంపైర్లకు సూచించాడు. పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో ఇంజమామ్‌ ఈ ఆరోపణలు చేశాడు.

కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్‌-8 మ్యాచ​్‌లో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా లక్ష్యానికి 25 పరుగుల దూరంలో (20 ఓవర్లలో 181/7) నిలిచిపోయింది. అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-37-3), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-24-2), బుమ్రా (4-0-2-9-1) ఆస్ట్రేలియాను దెబ్బకొట్టారు.

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్‌ గెలుపుతో టీ20 వరల్డ్‌కప్‌ 2024లో నాలుగు సెమీస్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్‌-1 నుంచి భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌.. గ్రూప్‌-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్లు ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించాయి. జూన్‌ 27 ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ తలపడనుండగా.. అదే రోజు రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్‌ జట్లు ఢీకొంటాయి.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)