రెండు సార్లు ప్రపంచకప్‌ గెలిచినా, ఇంగ్లండ్‌కు ఆ కల తీరడం లేదు..!

Published on Wed, 06/05/2024 - 17:55

టీ20 వరల్డ్‌కప్‌ల్లో తమ ఖండానికి (యూరప్‌) చెందిన జట్లపై విజయం సాధించడం ఢిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌కు తీరని కలగా మిగిలిపోయింది. ఇంగ్లండ్‌ ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్‌ పోటీల్లో సొంత ఖండానికి చెందిన జట్లపై ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయింది. పొట్టి ప్రపంచకప్‌లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన ఇంగ్లండ్‌.. సొంత ఖండానికి చెందిన జట్లైన నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ జట్లను ఇప్పటివరకు నాలుగు సందర్భాల్లో ఎదుర్కొంది.

ఇందులో మూడింట ఊహించని పరాజయాలు ఎదుర్కోగా.. ఓ మ్యాచ్‌ ఫలితం తేలకుండా ముగిసింది. 2009, 2014 ఎడిషన్లలో నెదర్లాండ్స్‌ చేతిలో పరాభావాలు ఎదుర్కొన్న ఇంగ్లండ్‌.. 2022 ఎడిషన్‌లో ఐర్లాండ్‌ చేతిలో చావుదెబ్బ తింది. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ నిన్న సహచర యూరప్‌ జట్టైన స్కాట్లాండ్‌తో తలపడింది.

ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో ప్రపంచకప్‌లో సొంత ఖండానికి చెందిన జట్టుపై గెలవాలన్న ఇంగ్లండ్‌ కల కలగానే మిగిలిపోయింది. యూరోపియన్‌ దేశాల్లో టెస్ట్‌ హోదా కలిగిన ఎకైక దేశమైన ఇంగ్లండ్‌ సొంత ఖండ జట్లు, క్రికెట్‌ పసికూనలపై ఇప్పటివరకు ఒక్క విజయం సాధించలేకపోవడం​ క్రికెట్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

కాగా, టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా బార్బడోస్‌ వేదికగా ఇంగ్లండ్‌- స్కాట్లాండ్‌ మధ్య నిన్న జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్‌కు ముందే వర్షం ప్రారంభం కావడంతో టాస్‌ ఆలస్యంగా పడింది. టాస్‌ గెలిచిన స్కాట్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని 10 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్‌ రద్దయ్యే సమయానికి జార్జ్‌ మున్సే (41), మైఖేల్‌ జోన్స్‌ (45) క్రీజ్‌లో ఉన్నారు. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)