Breaking News

సెమీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ ఘోర పరాజయం.. తొలిసారి ఫైనల్లో సౌతాఫ్రికా

Published on Thu, 06/27/2024 - 08:40

టీ20 వరల్డ్‌కప్‌ 2024 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఆఫ్ఘనిస్తాన్‌ చిత్తు ఓడింది. ట్రినిడాడ్‌ వేదికగా ఇవాళ (జూన్‌ 27) జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తొలిసారి వరల్డ్‌కప్‌ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్‌కు చేరింది.

రెచ్చిపోయిన సఫారీ బౌలర్లు.. చేతులెత్తేసిన ఆఫ్ఘన్‌ బ్యాటర్లు
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 56 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు విరుచుకుపడటంతో ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. జన్సెన్‌ (3-0-16-3), షంషి (1.5-0-6-3), రబాడ (3-1-14-2), నోర్జే (3-0-7-2) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌ను కకావికలం చేశారు. 

ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు మాత్రమే (అజ్మతుల్లా (10)) రెండంకెల స్కోర్‌ చేయగలిగారంటే సఫారీ పేసర్లు ఏరకంగా రెచ్చిపోయారో అర్దమవుతుంది. గుర్బాజ్‌ (0), జద్రాన్‌ (2), గుల్బదిన్‌ నైబ్‌ (9), నబీ (0), ఖరోటే (2), కరీమ్‌ జనత్‌ (8), రషీద్‌ ఖాన్‌ (8), నూర్‌ అహ్మద్‌ (0), నవీన్‌ ఉల్ హక్‌ (2) దారుణంగా విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన పరుగులు అత్యధికం (13) కావడం విశేషం.

ఆడుతూ పాడుతూ..
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా కేవలం 8.5 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోయి విజయతీరాలకు చేరింది. డికాక్‌ 5 పరుగులు చేసి ఫజల్‌ హక్‌ ఫారూఖీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ కాగా.. రీజా హెండ్రిక్స్‌ (29), మార్క్రమ్‌ (23) సౌతాఫ్రికాను గెలుపు తీరాలు దాటించారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)