Breaking News

T20 WC 2026: టోర్నీ నుంచి కెప్టెన్‌ అవుట్‌

Published on Fri, 02/13/2026 - 17:23

ఐర్లాండ్‌ క్రికెట్‌ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వరుస పరాజయాలతో టీ20 ప్రపంచకప్‌-2026 సూపర్‌-8 అవకాశాలను ఐరిష్‌ టీమ్‌ సంక్లిష్టం చేసుకుంది.

ఇలాంటి తరుణంలో కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (Paul Stirling) టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. లీగ్‌ దశలో మిగిలిన రెండు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ఐర్లాండ్‌ క్రికెట్‌ శుక్రవారం వెల్లడించింది.

కాగా టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఒమన్‌లతో కలిసి గ్రూప్‌-బి నుంచి ఐర్లాండ్‌ పోటీలో దిగింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిన స్టిర్లింగ్‌ బృందం.. రెండో పోరులో ఆస్ట్రేలియా చేతిలో 67 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

గాయపడిన కెప్టెన్‌
కొలంబోలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌ సందర్భంగానే కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ గాయపడ్డాడు. అతడి కుడి మోకాలికి గాయమైంది. స్కానింగ్‌ నిమిత్తం ఆస్పత్రికి పంపగా గాయం తీవ్రంగా ఉందని తేలడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు.

యువ బ్యాటర్‌ ఎంట్రీ
ఇక పాల్‌ స్టిర్లింగ్‌ స్థానంలో 20 ఏళ్ల బ్యాటర్‌ సామ్‌ టాపింగ్‌ (Sam Topping) ఐర్లాండ్‌ ప్రపంచకప్‌ జట్టులోకి వచ్చాడు. స్టిర్లింగ్‌ స్వదేశానికి పయనం కాగా.. సామ్‌ భారత్‌కు చేరుకోనున్నాడు. కాగా ఐర్లాండ్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడుతుంది. ఇరుజట్ల మధ్య శనివారం జరిగే ఈ పోరుకు కొలంబో వేదిక. 

ఇదిలా ఉంటే.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే చెరో రెండు విజయాలతో టాప్‌-2లో ఉన్నాయి. జింబాబ్వే చేతిలో ఆసీస్‌ తాజా ఓటమి ఆ జట్టును క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది.

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ఐర్లాండ్‌ జట్టు (అప్‌డేటెడ్‌)
మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, సామ్ టాపింగ్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.

చదవండి: నిన్ను నాశనం చేస్తా: పాక్‌ మాజీ క్రికెటర్‌పై భజ్జీ ఆగ్రహం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)