Breaking News

నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ క్రికెటర్‌ అతడే: టీమిండియా స్టార్‌

Published on Sun, 05/19/2024 - 18:45

టీ20 ప్రపంచకప్‌-2007, వన్డే వరల్డ్‌కప్‌-2011.. టీమిండియా ట్రోఫీ గెలిచిన రెండు సందర్బాల్లోనూ జట్టులో భాగంగా ఉన్నాడు స్పిన్నర్ పీయూశ్‌ చావ్లా. ఏకంగా రెండుసార్లు ట్రోఫీని ముద్దాడే అదృష్టం దక్కించుకున్నాడు.  ‌

2006లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ యూపీ స్పిన్నర్‌ తన కెరీర్‌ మొత్తంలో 3 టెస్టులు, 25 వన్డేలు, ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 7, 32, 4 వికెట్లు తీశాడు.

అయితే, ఈ రైటార్మ్‌ లెగ్ బ్రేక్‌ స్పిన్నర్‌కు ఐపీఎల్‌లో మాత్రం ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 192 మ్యాచ్‌లు ఆడిన పీయూశ్‌ ‌192 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ తరఫున 11 మ్యాచ్‌లలో కలిపి 13 వికెట్లు పడగొట్టాడు.

ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024 ట్రోఫీ టూర్‌ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ బృందంతో కలిసి పీయూశ్‌ చావ్లా హైదరాబాద్‌లోని సాక్షి మీడియా ఆఫీస్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా ట్రోఫీని ఆవిష్కరించి టీమిండియాకు విష్‌ చేశాడు.

ఈ క్రమంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. తన ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరో తెలియజేశాడు. ‘‘రోహిత్ శర్మ నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌. తను నాకు స్నేహితుడు. ఐపీఎల్‌-2024లో ఆఖరి మ్యాచ్‌ సందర్భంగా అతడు ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈసారి వరల్డ్‌కప్‌లో రోహిత్‌ ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పీయూశ్‌ చావ్లా పేర్కొన్నాడు.

కాగా ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడిగా బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ..  14 మ్యాచ్‌లు ఆడి 417 పరుగులు చేశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌పై సెంచరీ చేసిన హిట్‌మ్యాన్‌..  లీగ్‌ దశలో ఆఖరిదైన లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లోనూ అర్ధ శతకం(38 బంతుల్లో 68)తో సత్తా చాటాడు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)