Breaking News

ఉ‍త్కంఠ పోరు.. 'రహానే' జట్టు సూపర్‌ విజయం

Published on Wed, 06/03/2026 - 19:13

టీ20 ముంబై లీగ్‌ 2026లో ఇవాళ (జూన్‌ 3) ఓ ఆసక్తికర సమరం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన మ్యాచ్‌లో నార్త్‌ ముంబై పాంథర్స్‌, బాంద్రా బ్లాస్టర్స్‌ జట్లు తలపడగా.. అజింక్య రహానే నేతృత్వం వహిస్తున్న ముంబై పాంథర్స్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు సమాన స్కోర్లు చేయగా.. సూపర్‌ ఓవర్‌లో ముంబై పాంథర్స్‌ పైచేయి సాధించింది.

నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బాంద్రా బ్లాస్టర్స్‌.. కెప్టెన్‌ సువేద్‌ పార్కర్‌ (110) శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పాంథర్స్‌ టీమ్‌.. బ్లాస్టర్స్‌కు ధీటుగా పోరాడి స్కోర్‌ను సమం చేసింది. 

16 ఓవర్ల వరకు ఓటమి ఖాయమనుకున్న పాంథర్స్‌ అనూహ్యంగా పుంజుకొని చివరి 4 ఓవర్లలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి స్కోర్‌ను సమం చేసింది. వైభవ్‌ మాలి (32), రాహుల్‌ సావంత్‌ (10), తనుశ్‌ కోటియన్‌ (32 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా తనుశ్‌ చివరి ఓవర్లో బౌండరీ, సిక్సర్‌ సహా చివరి బంతికి రెండు పరుగులు సాధించి మ్యాచ్‌ టై కావడంలో కీలకపాత్ర పోషించాడు. 

అనంతరం సూపర్‌ ఓవర్‌లో వైభవ్‌ మాలి మరోసారి రెచ్చిపోవడంతో (2 సిక్సర్లు, ఫోర్‌) తొలుత బ్యాటింగ్‌ చేసిన పాంథర్స్‌ 6 బంతుల్లో 20 పరుగులు చేసింది. ఛేదనలో మోహిత్‌ అవస్థి అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో బ్లాస్టర్స్‌ జట్టు 7 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. కాగా, ఈ టోర్నీలో రహానే, శివమ్‌ దూబే, శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి ఐపీఎల్‌ స్టార్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు