ఇరగదీస్తున్న సామ్‌ కర్రన్‌.. ఈసారి బంతితో విజృంభణ 

Published on Sat, 06/17/2023 - 15:19

టీ20 బ్లాస్ట్‌-2023లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్‌లో పలు మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో రాణించిన కర్రన్‌.. నిన్న (జూన్‌ 16) సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో (4-0-26-5) చెలరేగాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహించిన సర్రే టీమ్‌ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సర్రే.. విల్‌ జాక్స్‌ (60), ఆఖర్లో క్రిస్‌ జోర్డాన్‌ (12 బంతుల్లో 36 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు) రాణిం‍చడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సోమర్‌సెట్‌ బౌలర్లలో బెన్‌ గ్రీన్‌ 4, డేవీ 3, మ్యాట్‌ హెన్రీ, వాన్‌ డెర్‌ మెర్వ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బరిలోకి దిగిన సోమర్‌సెట్‌.. సామ్‌ కర్రన్‌ (5/26), క్రిస్‌ జోర్డాన్‌ (2/31), అట్కిన్సన్‌ (1/19) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. సోమర్‌ సెట్‌ ఇన్నింగ్స్‌లో టామ్‌ బాంటన్‌ (53), టామ్‌ అబెల్‌ (39) పర్వాలేదనిపించారు.

ఐపీఎల్‌లో 18.50 కోట్లు పెడితే తేలిపోయాడు.. ఇక్కడేమో ఇరగదీస్తున్నాడు
ఐపీఎల్‌ 2023లో సామ్‌ కర్రన్‌పై పం‍జాబ్‌ కింగ్స్‌ 18.50 కోట్ల పెట్టుబడి పెడితే, అందులో పావు భాగానికి కూడా న్యాయం చేయలేకపోయాడు. అక్కడ బ్యాట్‌తో బంతితో తేలిపోయిన కర్రన్‌ స్వదేశంలో జరిగే టీ20 బ్లాస్ట్‌లో మాత్రం రెండు విభాగాల్లోనూ ఇరగదీస్తున్నాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యచ్‌లు ఆడిన కర్రన్‌.. ఓ ఫైఫర్‌ సాయంతో 12 వికెట్లు పడగొట్టి, బ్యాటింగ్‌లో 3 అర్ధసెంచరీల సాయంతో 252 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో కర్రన్‌ చేసింది తక్కువ పరుగులే అయినా, పలు మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలాగే కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి, తన జట్టు విజయాలకు దోహదపడ్డాడు. 

చదవండి: 546 పరుగులతో బంగ్లా గెలుపు.. 21వ శతాబ్దంలో అతిపెద్ద విజయం

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)