Breaking News

వరుసగా 5 సిక్సర్లు.. విధ్వంసకర శతరం.. చరిత్ర సృష్టించిన ఆసీస్‌ బ్యాటర్‌

Published on Sun, 09/14/2025 - 08:36

టీ20 బ్లాస్ట్‌ 2025లో హ్యాంప్‌షైర్‌ ఆటగాడు (ఆసీస్‌) క్రిస్‌ లిన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ ఫైనల్స్‌ డే (టీ20 బ్లాస్ట్‌లో సెమీస్‌, ఫైనల్స్‌ ఒకే రోజు జరుగుతాయి) చరిత్రలో శతకం బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (సెప్టెంబర్‌ 13) నాటింగ్హమ్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్‌లో 50 బంతుల్లో శతకం పూర్తి చేసిన లిన్‌.. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. తద్వారా తన జట్టును ఒంటిచేత్తో ఫైనల్స్‌కు చేర్చాడు. 159 పరుగుల లక్ష్య ఛేదనలో లిన్‌ ఒక్కడే 90 శాతం పరుగులు చేశాడు. సెంచరీ పూర్తి చేసే క్రమంలో ఓ ఓవర్‌లో (లాయిడ్‌ పోప్‌) వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు.

లిన్‌ రికార్డు శతకంతో హ్యాంప్‌షైర్‌ను ఫైనల్స్‌కు చేర్చినా.. ఆ జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. తొలి సెమీఫైనల్‌ (ఇది కూడా నిన్ననే జరిగింది) విజేత సోమర్‌సెట్‌తో జరిగిన ఫైనల్లో హ్యాంప్‌షైర్‌ ఓటమిపాలైంది. సెమీస్‌లో విధ్వంసకర శతకంతో చెలరేగిన లిన్‌ ఫైనల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 7 బంతుల్లో సిక్స్‌, ఫోర్‌ సాయంతో 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

ఫైనల్లో లిన్‌ విఫలమైనా హ్యాంప్‌షైర్‌ భారీ స్కోరే (194/6)​ చేసింది. అయితే దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. విల్‌ స్మీడ్‌ (58 బంతుల్లో 94; 14 ఫోర్లు, 14 ఫోర్లు, సిక్స్‌) విధ్వంసం సృష్టించి సోమర్‌సెట్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. సోమర్‌సెట్‌కు ఇది మూడో టీ20 బ్లాస్ట్‌ టైటిల్‌. ఫైనల్లో స్మీడ్ చేసిన పరుగులు (94) టోర్నీ ఫైనల్స్‌ ఛేదనల చరిత్రలో అత్యధికం.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)