అరివీర భయంకర ఫామ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్‌.. నిర్దాక్షిణ్యంగా ఊచకోత

Published on Sun, 06/04/2023 - 14:51

ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జేమ్స్‌ విన్స్‌ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 బ్లాస్ట్‌-2023లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోస్తున్నాడు. ఆడిన ప్రతి బంతిని బౌండరీ లేదా సిక్సర్‌గా మలుస్తున్నాడు. ససెక్స్‌తో నిన్న (జూన్‌ 3) జరిగిన మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న విన్స్‌.. 8 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేసి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ విన్స్‌ ఇదే తరహాలో రెచ్చిపోయాడు. ఆ బౌలర్‌, ఈ బౌలర్‌ అన్న తేడా లేకుండా ఎడాపెడా వాయించాడు. తొలుత మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 88 పరుగులు చేసిన విన్స్‌.. ఆతర్వాత ససెక్స్‌పై 56 బంతుల్లో 88 పరుగులు, ఎసెక్స్‌పై 48 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఎసెక్స్‌పై చేసిన మెరుపు సెంచరీలో 8 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇంతటి భీకర ఫామ్‌లో ఉన్న ఈ హ్యాంప్‌షైర్‌ ఆటగాడు.. మున్ముందు మరిన్ని విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడతాడని ఇంగ్లండ్‌ అభిమానులు అనుకుంటున్నాడు. 

ఇక ససెక్స్‌తో మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన హ్యాంప్‌షైర్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. లియామ్‌ డాసన్‌ (4-0-18-2), స్కాట్‌ కర్రీ (2/25), జేమ్స్‌ ఫుల్లర్‌ (1/9), వుడ్‌ (1/32), మేసన్‌ క్రేన్‌ (1/32) ధాటికి ససెక్స్‌ 18.5 ఓవర్లలో 144 పరుగులె మాత్రమే చేసి ఆలౌటైంది. ససెక్స్‌ ఇన్నింగ్స్‌లో టామ్‌ క్లార్క్‌ (36) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్‌షైర్‌.. కేవలం 14.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా విజయం సాధించింది. ఓపెనర్లు బెన్‌ మెక్‌ డెర్మాట్‌ (51 బంతుల్లో 69 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జేమ్స్‌ విన్స్‌ (39 బంతుల్లో 71 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయమైన అర్ధశతకాలతో హ్యాంప్‌షైర్‌ను విజయతీరాలకు చేర్చారు.  ఈ విజయయంతో హ్యాంప్‌షైర్‌ సౌత్‌ గ్రూప్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్‌లో సోమర్‌సెట్‌ ,సర్రే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)