Breaking News

చెలరేగిన లివింగ్‌స్టోన్‌.. బట్లర్‌ ఊచకోత

Published on Sat, 06/24/2023 - 15:04

టీ20 బ్లాస్ట్‌లో భాగంగా డెర్బీషైర్‌తో నిన్న (జూన్‌ 23) జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌, లాంకాషైర్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న బట్లర్‌.. 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. బట్లర్‌కు మరో ఎండ్‌లో లియామ్‌ లవింగ్‌స్టోన్‌ (30 బంతుల్లో 47 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) సహకరించడంతో లాంకాషైర్‌ 15 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 4 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆఖర్లో వెల్స్‌ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) భారీ షాట్‌లు ఆడాడు. డెర్బీషైర్‌ బౌలర్లలో జాక్‌ ఛాపెల్‌ 2, జమాన్‌ ఖాన్‌, మెక్‌ కీయెర్‌నన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

చెలరేగిన లివింగ్‌స్టోన్‌.. బట్లర్‌ ఊచకోత
టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన లాంకాషైర్‌.. ఆది నుంచే దూకుడుగా ఆడింది. సాల్ట్‌ (11 బంతుల్లో 16; 2 ఫోర్లు) వికెట్‌ పడిపోయాక బట్లర్‌ గేర్‌ మార్చి ధాటిగా ఆడటం ప్రారంభించాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది డెర్బీషర్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. బట్లర్‌ ఔటయ్యాక లివింగ్‌స్టోన్‌ కూడా చెలరేగిపోయాడు. ఆదిలో లవింగ్‌స్టోన్‌ కాస్త నిదానంగా ఆడినప్పటికీ.. ఆఖర్లో రెచ్చిపోయాడు. 3 భారీ సిక్సర్లు బాదాడు.

భారీ లక్ష్య ఛేదనలో తడబడిన డెర్బీషైర్‌..
178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెర్బీషైర్‌.. ఆది నుంచే తడబడుతూ వచ్చింది. లాంకాషైర్‌ బౌలర్లు టామ్‌ బెయిలీ (2/16), డారిల్‌ మిచెల్‌ (2/13), లూక్‌ వెల్స్‌ (2/32), టామ్‌ హార్ట్‌లీ ధాటికి ఆ జట్టు 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డెర్బీషైర్‌ ఇన్నింగ్స్‌లో హ్యారీ కేన్‌ (45), బ్రూక్‌ గెస్ట్‌ (31 నాటౌట్‌) ఓ మోస్తరుగా రాణించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)