Breaking News

తిలక్‌ వర్మ విఫలం.. హైదరాబాద్‌కు మరో ఓటమి

Published on Thu, 11/28/2024 - 09:38

రాజ్‌కోట్‌: బ్యాటర్ల వైఫల్యంతో దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 24 పరుగుల తేడాతో రాజస్తాన్‌ చేతిలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 

కార్తీక్‌ శర్మ (27 బంతుల్లో 58; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకోగా... దీపక్‌ హుడా (46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 97 పరుగుల జోడించడంతో రాజస్తాన్‌ జట్టు మంచి స్కోరు చేయగలిగింది. హైదరాబాద్‌ బౌలర్లలో రవితేజ, అనికేత్‌ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులకే పరిమితమైంది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్‌ సెంచరీతో విజృంభించిన హైదరాబాద్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ (13) ఈసారి విఫలం కాగా... తన్మయ్‌ అగర్వాల్‌ (33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తనయ్‌ త్యాగరాజన్‌ (32 నాటౌట్‌; 3 ఫోర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. 

రాజస్తాన్‌ బౌలర్లలో మానవ్‌ సుతార్, అనికేత్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తాజా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు పరాజయాలు ఖాతాలో వేసుకున్న హైదరాబాద్‌ జట్టు 4 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో రేపు బిహార్‌తో హైదరాబాద్‌ ఆడుతుంది.    

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)