Breaking News

హ్యాట్రిక్ వికెట్లు తీసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్‌..

Published on Fri, 10/27/2023 - 15:42

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేసర్‌, ముంబై ఫాస్ట్‌ బౌలర్‌ తుషార్‌ దేశ్‌పాండే తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం మిజోరాంతో జరిగిన మ్యాచ్‌లో  దేశ్‌పాండే హ్యాట్రిక్‌ వికెట్లతో చెలరేగాడు. మిజోరాం బ్యాటర్లు  వికాష్ కుమార్, జెహూ ఆండర్సన్, జోసెఫ్ లాల్‌థాన్‌ఖుమాను ఔట్‌ చేసిన దేశ్‌పాండే.. హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన తుషార్‌ 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే 15 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మిజోరాం ముంబై బౌలర్ల ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 76 పరుగులకే కుప్పకూలింది.

ముంబై బౌలర్లలో దేశ్‌పాండేతో పాటు రాయ్స్టన్ డయాస్, మోహిత్‌ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం 77 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 6 ఓవర్లలో ఒక్క వికెట్‌ నష్టపోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌(46 నాటౌట్‌) మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు.
చదవండి: World Cup 2023: మరీ ఇంత బద్దకమా? క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రనౌట్‌.. వీడియో వైరల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)