Breaking News

SMAT 2024: ముంబైతో క్వార్టర్‌ ఫైనల్‌.. భారీ స్కోర్‌ చేసిన విదర్భ

Published on Wed, 12/11/2024 - 15:35

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ఇవాళ (డిసెంబర్‌ 11) క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. క్వార్టర్‌ ఫైనల్‌-3లో సౌరాష్ట్రపై మధ్యప్రదేశ్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందగా.. క్వార్టర్‌ ఫైనల్‌-1లో బెంగాల్‌పై బరోడా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఆలుర్‌ వేదికగా ప్రస్తుతం క్వార్టర్‌ ఫైనల్‌-4 మ్యాచ్‌ జరుగుతుంది. ముంబైతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విదర్భ తొలుత బ్యాటింగ్‌ చేసింది. టాస్‌ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బరిలోకి దిగిన విదర్భ భారీ స్కోర్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 

అథర్వ తైడే (66), అపూర్వ్‌ వాంఖడే (51) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. శుభమ్‌ దూబే (43 నాటౌట్‌) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. ఓపెనర్‌ కరుణ్ నాయర్‌ 26, పార్థ్‌ రేఖడే 1, కెప్టెన్‌ జితేశ్‌ శర్మ 11, మందార్‌ మహలే 13 పరుగులు చేసి ఔటయ్యారు. 

ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో శుభమ్‌ దూబే, మందార్‌ మహలే కలిసి 24 పరుగులు పిండుకున్నారు. మొహిత్‌ అవస్తి వేసిన ఈ ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ బౌండరీ వచ్చాయి. అంతకుముందు 19వ ఓవర్‌లోనూ 16 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌ను సూర్యాంశ్‌ షెడ్గే వేశాడు. ముంబై బౌలర్లలో ‌సూర్యాంశ్‌ షెడ్గే, అథర్వ అంకోలేకర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తనుశ్‌ కోటియన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)