Breaking News

విధ్వంసం సృష్టించిన షా, రహానే, దూబే

Published on Wed, 12/11/2024 - 17:30

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇవాళ (డిసెంబర్‌ 11) జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌-4లో ముంబై విదర్భపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్‌కు చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విదర్భ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అథర్వ తైడే (66), వాంఖడే (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో శుభమ్‌ దూబే (43 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

అనంతరం బరిలోకి దిగిన ముంబై.. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు పృథ్వీ షా (26 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అజింక్య రహానే (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. ఆఖర్లో శివమ్‌ దూబే (22 బంతుల్లో 37 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు), సూర్యాంశ్‌ షేడ్గే (12 బంతుల్లో 36 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసం సృస్టించారు. 

ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపుపై ఆశలు వదులుకున్న తరుణంలో శివమ్‌ దూబే, సూర్యాంశ్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై విజయానికి  షా, రహానే బీజం వేసినప్పటికీ.. మధ్యలో టీమిండియా స్టార్లు శ్రేయస్‌ అయ్యర్‌ (5), సూర్యకుమార్‌ యాదవ్‌ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.

సూపర్‌ ఫామ్‌లో రహానే
ఈ టోర్నీలో ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజింక్య రహానే సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. రహానే గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 52, 68, 22, 95, 84 పరుగులు స్కోర్‌ చేశాడు. విదర్భతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో రహానే కేవలం 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)