కెప్టెన్లుగా టీమిండియా స్టార్లు తిలక్‌, సంజూ, భరత్‌.. పొట్టి క్రికెట్‌ టోర్నీ షురూ

Published on Mon, 10/16/2023 - 11:15

Syed Mushtaq Ali Trophy 2023- జైపూర్‌: దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ నేడు మొదలవుతుంది. 22 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 38 జట్ల మధ్య 135 మ్యాచ్‌లు జరుగుతాయి. 38 జట్లను ఐదు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ ‘ఎ’లో హైదరాబాద్, డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై, బరోడా, హరియాణా, ఛత్తీస్‌గఢ్, జమ్మూ కశ్మీర్, మిజోరం, మేఘాలయ ఉన్నాయి.

ఇక గ్రూప్‌ ‘సి’లో ఆంధ్ర, రైల్వేస్, సౌరాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్, గోవా, గుజరాత్, మణిపూర్, పంజాబ్‌ జట్లకు చోటు కల్పించారు. అక్టోబర్‌ 27 వరకు గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్‌ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఐదు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 10 జట్లు నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తాయి.

కాగా సోమవారం జరిగే తొలి లీగ్‌ మ్యాచ్‌లలో తిలక్‌ వర్మ సారథ్యంలోని హైదరాబాద్‌ జట్టు మేఘాలయతో... కోన శ్రీకర్‌ భరత్‌ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు గోవాతో తలపడతాయి. ఈ టోర్నీ మ్యాచ్‌లను జియో సినిమా యాప్, స్పోర్ట్స్‌ 18 ఖేల్‌ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 

ఇక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2023లో కోన శ్రీకర్‌ భరత్‌(ఆంధ్ర), తిలక్‌ వర్మ(హైదరాబాద్‌)తో మరో టీమిండియా స్టార్‌ సంజూ శాంసన్‌(కేరళ) సైతం.. హిమాచల్‌ ప్రదేశ్‌ అక్టోబరు 16 నాటి మ్యాచ్‌తో కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు.  

గ్రూప్ ఎ: హర్యానా, బరోడా, ఛత్తీస్ గఢ్, మేఘాలయ, హైదరాబాద్, మిజోరం, ముంబై, జమ్ముకశ్మీర్.
గ్రూప్ బి: అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, బీహార్, చండీగఢ్, ఒడిశా, సిక్కిం, సర్వీసెస్.
గ్రూప్ సి: ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మణిపూర్, పంజాబ్, రైల్వేస్, సౌరాష్ట్ర.
గ్రూప్ డి: బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, పుదుచ్చేరి, రాజస్థాన్, ఉత్తరాఖండ్, విదర్భ.
గ్రూప్ ఇ: ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, నాగాలాండ్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్.
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)