Breaking News

నిరాశపరిచిన సంజూ శాంసన్‌.. కేరళ ఘన విజయం

Published on Mon, 10/16/2023 - 21:24

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023ను కేరళ జట్టు విజయంతో ఆరంభించింది. ముంబై వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో కేరళ విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేరళ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కేరళ బ్యాటర్లలో​ విష్ణు వినోద్‌(44) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సచిన్‌ బేబీ(30), నైజర్‌(23) పరుగులతో రాణించారు.

నిరాశపరిచిన సంజూ..
ఫామ్‌ లేమితో భారత సీనియర్‌ జట్టులో చోటు కోల్పోయిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, కేరళ కెప్టెన్‌ సంజూ శాంసన్‌.. హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్‌ కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. హిమాచల్ బౌలర్‌ ముకల్‌ నేగీ బౌలింగ్‌లో సంజూ ఔటయ్యాడు.

చెలరేగిన వినోద్‌ కుమార్‌, శ్రేయస్‌ గోపాల్‌..
ఇక 164 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్‌ 128 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్లలో వినోద్‌ కుమార్‌, శ్రేయస్‌ గోపాల్‌ తలా 4 వికెట్లతో హిమాచల్ పతనాన్ని శాసించారు. హిమాచల్ ప్రదేశ్‌ బ్యాటర్లలో నికిల్‌ గంగటా(42) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: SMT 2023: 3 వికెట్లు పడగొట్టిన అర్జున్‌ టెండూల్కర్‌.. పోరాడి ఓడిన ఆంధ్ర

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)