ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్‌

Published on Mon, 12/09/2024 - 20:51

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ఉత్తర్‌ప్రదేశ్‌ జట్టు క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (డిసెంబర్‌ 9) జరిగిన రెండో ప్రీ క్వార్టర్‌ ఫైనల్లో యూపీ ఆంధ్రప్రదేశ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు విప్రాజ్‌ నిగమ్‌ (ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిగమ్‌ను 50 లక్షలకు కొనుగోలు చేసింది) ఆల్‌రౌండ్‌ షోతో (4-0-20-2, 8 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టి యూపీని గెలిపించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆంధ్రప్రదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఏపీ ఇన్నింగ్స్‌లో ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్‌ (34 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. కేవీ శశికాంత్‌ (23 నాటౌట్‌), కెప్టెన్‌ రికీ భుయ్‌ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

శ్రీకర్‌ భరత్‌ (4), అశ్విన్‌ హెబ్బర్‌ (11), షేక్‌ రషీద్‌ (18), పైలా అవినాశ్‌ (19), త్రిపురణ విజయ్‌ (16) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. యూపీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, విప్రాజ్‌ నిగమ్‌ తలో రెండు వికెట్లు తీయగా.. మొహిసిన్‌ ఖాన్‌, శివమ్‌ మావి చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉత్తర్‌ప్రదేశ్‌.. మరో ఓవర్‌ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కరణ్‌ శర్మ (48) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. రింకూ సింగ్‌ (22 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్సర్‌), విప్రాజ్‌ నిగమ్‌ (27 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి యూపీని గెలిపించారు. 

కే సుదర్శన్‌ (4-1-23-3), త్రిపురణ విజయ్‌ (4-0-21-2), సత్యనారాయణ రాజు (4-0-30-1) మెరుగ్గా బౌలింగ్‌ చేసినప్పటికీ ఏపీని గెలిపించలేకపోయారు. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు డిసెంబర్‌ 11న జరుగనున్నాయి.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)