Breaking News

చరిత్ర సృష్టించిన స్విట్జర్లాండ్‌.. 90 ఏళ్ల నిరీక్షణకు తెర

Published on Fri, 07/03/2026 - 11:00

స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫిఫా వరల్డ్‌కప్‌లో తమ 90 ఏళ్ల ప్రయాణంలో తొలిసారి నాకౌట్‌ దశలో విజయాన్ని సాధించింది. 2026 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (జులై 3) జరిగిన రౌండ్‌ ఆఫ్‌ 32లో అల్జీరియాపై 2–0 గోల్స్‌ తేడాతో  ఘన విజయం సాధించడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్రి క్వార్టర్స్‌కు (రౌండ్‌ ఆఫ్‌ 16) అర్హత సాధించింది.

అల్జీరియాపై స్విట్జర్లాండ్ మ్యాచ్‌ ప్రారంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి 10 నిమిషాల్లోనే బ్రీల్ ఎంబోలో గోల్ చేసి శుభారంభం అందించాడు. ఆ గోల్‌కు జోహాన్ మాన్జాంబి అద్భుతమైన అసిస్ట్ అందించాడు. ప్రారంభ గోల్‌తో స్విట్జర్లాండ్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.

రెండో అర్ధభాగం ఆరంభమైన వెంటనే డాన్ న్డోయే మరో గోల్ సాధించి స్కోరు 2–0కి పెంచాడు. ఈ గోల్ మ్యాచ్‌ను పూర్తిగా స్విట్జర్లాండ్ వైపు తిప్పింది. అనంతరం అల్జీరియా జట్టు పోరాటంలో నిలిచేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ, స్విస్ రక్షణ విభాగం  క్రమశిక్షణతో ఆ ప్రయత్నాలను అడ్డుకుంది. అల్జీరియా కెప్టెన్ రియాద్ మహ్రెజ్ నాయకత్వంలో ఆ జట్టు కొంత సమయం బంతి నియంత్రణ సాధించినప్పటికీ, గోల్ చేసే అవకాశాలను సృష్టించుకోవడంలో విఫలమైంది.

స్విట్జర్లాండ్ జట్టు మొత్తం మ్యాచ్‌లో సమతుల్య ఆటతీరు, వేగవంతమైన కౌంటర్ అటాక్స్ మరియు కఠినమైన డిఫెన్స్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా మాన్జాంబి ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే స్థాయిలో నిలిచింది. అతని పాస్‌లు, అటాక్‌లు స్విస్ జట్టుకు కీలకంగా మారాయి.

ఈ విజయంతో స్విట్జర్లాండ్ ప్రపంచ కప్ నాకౌట్ దశలో తమ దీర్ఘకాలిక వైఫల్యాలకు బ్రేక్ వేసినట్లైంది. అనేక దశాబ్దాలుగా నాకౌట్ మ్యాచ్‌లలో నిరాశ ఎదుర్కొన్న స్విస్ జట్టు, ఈసారి స్థిరమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. తదుపరి దశలో స్విట్జర్లాండ్  కొలంబియా-ఘనా మ్యాచ్‌ విజేతను ఎదుర్కొనుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)