Breaking News

మిఠాయిలకు దూరం...‘బంగారం’తో సంబరం

Published on Wed, 09/04/2024 - 09:53

పారిస్‌ పారాలింపిక్స్‌లో అద్వితీయ ప్రదర్శనతో పసిడి పతకం సాధించిన భారత జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌... బంగారు పతకాన్ని నిలబెట్టుకునేందుకు తనకిష్టమైన మిఠాయిలకు దూరమైనట్లు వెల్లడించాడు. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌64 విభాగంలో మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన సుమిత్‌... తాజా పారిస్‌ పారాలింపిక్స్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు.

సోమవారం రాత్రి జరిగిన పోటీల్లో సుమిత్‌ జావెలిన్‌ను 70.59 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. అనంతరం సుమిత్‌ మాట్లాడుతూ... ‘పారాలింపిక్స్‌ కోసం 10 నుంచి 12 కేజీల బరువు తగ్గా. అధిక బరువు వల్ల శరీరంపై ఒత్తిడిపడి మెరుగైన ప్రదర్శన చేయలేనని ఫిజియో సూచించడంతో నాకు ఇష్టమైన స్వీట్లు తినడం మానేశా.

ఒత్తిడి కారణంగా సరిగ్గా నిద్ర కూడా పోలేదు. టోక్యో సమయంలో నాపై పెద్దగా అంచనాలు లేవు కాబట్టి ఇబ్బంది లేకపోయింది. వంద శాతం ఫిట్‌నెస్‌తో లేకుండానే పారిస్‌ పోటీల్లో పాల్గొన్నా. గాయం భయంతో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. గత రెండు మూడేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నా... స్వదేశానికి చేరుకున్నాక కాస్త విశ్రాంతి తీసుకుంటా’ అని అన్నాడు. 

Videos

Nepal Floods: ప్రియ అధికారి ఎవరు? 6 రోజులు.. 100 మిషన్లు..

లండన్ లో త్రిష.. విజయ్ వెళ్ళేది ఆమె కోసమేనా!

టైల్స్ పై పడుకొని కెమెరా కెమెరా మెన్ లకు నమస్కారం

YSR ఘాట్ వద్ద వైఎస్ జగన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు

AP: 20 ఏళ్ల పగ.. వేటాడి వెంటాడి హత్య

కొట్టుకుపోతున్న పాకిస్థాన్ ఇస్లామాబాద్ ను ముంచెత్తిన వరదలు

అడిగి అడిగి అలసిపోయాం.. అందుకే పోరాటంలోకి దిగాం

ఇంజన్ ఫెయిల్.. ఇండిగో ఫ్లైట్ కు తప్పిన ఘోర ప్రమాదం

ఎవరు పూల సుబ్బయ్య.. వెలిగొండకు ఆయన పేరు ఎందుకు!

నేపాల్‌లో యాక్షన్‌లోకి ప్రధాని బాలేంద్ర షా!

Photos

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)