Breaking News

‘మానసిక దృఢత్వమే గెలిపించింది’

Published on Wed, 07/30/2025 - 04:20

న్యూఢిల్లీ: మహిళా చెస్‌ దిగ్గజం సుసాన్‌ పోల్గర్‌ భారత గ్రాండ్‌మాస్టర్‌ దివ్య దేశ్‌ముఖ్‌పై ప్రశంసలు కురిపించింది. వరల్డ్‌ కప్‌లో వేర్వేరు సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దివ్య గెలిచిన తీరు అద్భుతమని ఆమె వ్యాఖ్యానించింది. మానసిక దృఢత్వం, పోరాటతత్వమే ఆమెను చాంపియన్‌గా నిలిపిందని పోల్గర్‌ అభిప్రాయపడింది. ‘చారిత్రక విజయం సాధించిన దివ్యకు నా అభినందనలు. చాలా బాగా ఆడింది. టోర్నీకి ముందు ఫేవరెట్‌లలో ఆమె పేరు లేదు. 

అయితే గెలవాలనే పట్టుదల, మానసిక దృఢత్వంతో ఆమె ముందంజ వేయగలిగింది. టోర్నీలో దివ్య ఇబ్బంది పడిన గేమ్‌లు ఉన్నాయి. మంచి అవకాశాలు వచ్చినా వాటిని వృథా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వాటి ప్రభావం ఆమెపై పడలేదు. ఎలాంటి ఆందోళన లేకుండా ఆమె పోరాడింది. అదే పట్టుదల చివరి వరకు నిలిచి గెలిచేలా చేశాయి’ అని పోల్గర్‌ వ్యాఖ్యానించింది. ప్రపంచ చెస్‌లో ఇటీవలి కాలంలో భారత ఆటగాళ్లు సాధించిన విజయాలు అపూర్వమని ఆమె పేర్కొంది. 

వీరందరికీ గొప్ప భవిష్యత్తు ముందుందని పోల్గర్‌ జోస్యం చెప్పింది. ‘గుకేశ్‌ పెద్ద స్థాయికి చేరతాడని అతనికి 12 ఏళ్లు ఉన్నప్పుడే నేను చెబితే ఎవరూ నమ్మలేదు. 50 మంది గ్రాండ్‌మాస్టర్లను తయారు చేసిన నా అనుభవంతో ఆ వ్యాఖ్యలు చేశాను. దివ్య విషయంలో కూడా అదే జరిగింది. పెద్ద ప్లేయర్‌గా గుర్తింపు లేకపోయినా ఆమెలో ప్రత్యేక ప్రతిభ ఉంది కాబట్టే ఈ స్థాయిలో గెలిచింది. ప్రస్తుతం భారత చెస్‌లో స్వర్ణయుగం నడుస్తోంది. వారి ఆట గొప్పగా ఉండటంతో పాటు సరైన రీతిలో మద్దతు, దిశానిర్దేశం లభిస్తున్నాయి. 

దివ్య ఇక్కడితో ఆగిపోవద్దు. ఆమె ఆటపై అందరి దృష్టీ ఉంటుంది కాబట్టి మరింతగా కష్టపడి లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. హంపి అంటే కూడా నాకు గౌరవం ఉంది. సుదీర్ఘ కాలం ఆమె అగ్రస్థాయిలో కొనసాగింది. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ పరిస్థితులు కొంత ప్రతికూలంగా మారడం సహజం’ అని పోల్గర్‌ పేర్కొంది.   

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)