చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌.. తొలి భారత ఆటగాడిగా

Published on Sat, 01/07/2023 - 21:28

శ్రీలంకతో మూడో టీ20లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా  ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 112 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి.

ఇక ఈ మ్యాచ్‌లో తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఇన్నింగ్స్‌ ఆడిన సూర్య పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన తొలి భారత నాన్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌గా సూర్య రికార్డులకెక్కాడు. సూర్య ఇప్పటివరకు టీ20ల్లో మూడు అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు.

తొలి సెంచరీ ఇంగ్లండ్‌పై చేయగా.. న్యూజిలాండ్‌పై రెండో సెంచరీ, తాజాగా శ్రీలంకపై తన మూడో సెంచరీ నమోదు చేశాడు. అదే విధంగా టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా ఈ ముంబైకర్‌ నిలిచాడు. అంతకుముందు 2017లో శ్రీలంకపై రోహిత్‌ శర్మ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

ఇక ఓవరాల్‌గా టీ20ల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా సూర్య నిలిచాడు. తొలి స్థానంలో నాలుగు సెంచరీలతో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఉన్నాడు. ఆతర్వాత స్థానాల్లో వరుసగా మ్యాక్స్‌వెల్‌, మున్రో, డేవిజీ, చెరో మూడు సెంచరీలతో ఉన్నారు.
చదవండి: IND vs SL: సూర్యకుమార్‌ యాదవ్‌ విధ్వంసం.. 45 బంతుల్లోనే సెంచరీ

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)