Breaking News

సర్ఫరాజ్‌ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన సూర్యకుమార్‌..

Published on Sun, 10/02/2022 - 18:09

ముంబై ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ దేశీవాళీ టోర్నీల్లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోపీలో సెంచరీల మోత మోగించిన సర్ఫరాజ్‌.. ఇప్పడు ఇరానీ కప్‌లో కూడా అదరగొట్టాడు. ఇరానీ కప్‌లో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాకు సర్ఫరాజ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇరానీ ‍కప్‌లో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతులు ఎదర్కొన్న సర్ఫరాజ్‌ 20 ఫోర్లు, 2  సిక్స్‌లతో 138 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్‌ను టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రశసించాడు. సోషల్‌ మీడియాలో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఫోటోను సూర్య షేర్‌ చేస్తూ.. "నీ ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది" అంటూ క్యాప్షన్‌ పెట్టాడు.

ఇక ఇరానీ ‍కప్‌ తొలి ఇన్నింగ్స్‌లో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా 374 పరుగులకు ఆలౌటైంది. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌తో పాటు కెప్టెన్‌ హనుమా విహారి 82 పరుగులతో రాణించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాకు 276 పరుగుల అధిక్యం లభించింది.

ఇక రెండో రోజు ఆటముగిసే సమయానికి సౌరాష్ట్ర రెండు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. కాగా అంతకుముందు రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా బౌలర్లు చెలరేగడంతో  సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 98 పరుగులకే కుప్పకూలింది.


చదవండి: IND vs SA: రెండో టీ20కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరిగేనా?

Videos

పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం

చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!

ఆపరేషన్ సిందూర సమయంలో భారత్ దెబ్బకు పారిపోయి దాక్కున్నాం

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

Photos

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)