కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌.. భువనేశ్వర్‌కు చోటు

Published on Sat, 07/11/2026 - 14:33

యూకే ప‌ర్య‌ట‌న‌లో భార‌త పురుష‌ల క్రికెట్ జ‌ట్టు తీవ్ర నిరాశ‌ప‌రుస్తోంది. ఈ టూర్‌లో టీమిండియా ఇప్ప‌టివ‌ర‌కు క‌నీసం ఒక్క విజ‌యాన్ని కూడా న‌మోదు చేయ‌లేక‌పోయింది. ప‌సికూన ఐర్లాండ్ చేతిలో క్వీన్ స్వీప్ అయిన భార‌త జ‌ట్టు.. ఆ త‌ర్వాత ఇంగ్లండ్ గ‌డ్డ‌పై కూడా అదే తీరును కొన‌సాగించింది. 

వర్షం కారణంగా మొదటి టీ20 రద్దవ్వగా.. ఆ తర్వాత జరిగిన మూడు టీ20ల్లోనూ భారత్ ఓట‌మి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. ఈ రెండు సిరీస్‌ల‌లోనూ శ్రేయ‌స్ సేన‌ బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ విఫ‌ల‌మైంది.  

ఈ నేప‌థ్యంలో ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా భార‌త  ప్రత్యామ్నాయ  ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేశారు. ఆకాశ్ చోప్రా తన జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. కాగా ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు ముందు సూర్య‌కుమార్ యాద‌వ్‌ను భార‌త టీ20 కెప్టెన్సీ నుంచి బీసీసీఐ త‌ప్పించింది. 

అత‌డి స్ధానంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ప‌గ్గాలు అప్ప‌గించారు. కానీ అయ్య‌ర్ మాత్రం జ‌ట్టును విజ‌యం ప‌థంలో న‌డిపించ‌లేక‌పోతున్నాడు. దీంతో చాలామంది సూర్య‌కుమార్ కెప్టెన్‌గా ఉండింటే బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక చోప్రా త‌న ఎంపిక చేసిన జ‌ట్టులో సంజూ శాంస‌న్‌కు కూడా అవ‌కాశ‌మిచ్చాడు. 

యూకే ప‌ర్య‌ట‌న‌లో మొద‌టి మూడు మ్యాచ్‌ల‌లో సంజూ విఫ‌లం కావ‌డంతో అత‌డిని తుది జ‌ట్టు నుంచి త‌ప్పించారు. ఆ త‌ర్వాత జింబాబ్వేతో టీ20ల‌కు ఎంపిక చేసిన జ‌ట్టులో కూడ‌డా శాంసన్‌కు చోటు ద‌క్క‌లేదు. ఇక చోప్రా గ‌త రెండేళ్ల‌గా భార‌త టీ20కు దూరంగా ఉంటున్న యశస్వి జైస్వాల్‌కు ఓపెనర్‌గా అవ‌కాశ‌మిచ్చాడు. 

సంజూ, జైశ్వాల్‌ల‌కు ఓపెన‌ర్ల‌గా ఛాన్స్ ద‌క్కింది. అదేవిధంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు వ‌రుస‌గా రెండు టైటిల్స్‌ను అందించిన ర‌జ‌త్ పాటిదార్‌కు వైస్ కెప్టెన్‌గా అత‌డు ఎంపిక చేశాడు. పాటిదార్ ఇప్పటివరకు భారత్ తరఫున టీ20 మ్యాచ్ ఆడలేదు. మిడిల్ ఆర్డర్‌లో ధ్రువ్ జురెల్, నమన్ ధీర్‌లకు అవ‌కాశ‌మిచ్చాడు. 

జురెల్, టెస్ట్‌ వన్డేల్లో రెగ్యులర్ ఆటగాడైనప్పటికీ టీ20ల్లో మాత్రం లేడు. అదేవిధంగా ఆల్‌రౌండ‌ర్ల కోటాలో కృనాల్ పాండ్యా, అనుకుల్ రాయ్‌లకు చోటు దక్కింది. బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, మ‌హ్మ‌ద్ సిరాజ్‌లు ఉన్నారు. చోప్రా కేవ‌లం ఇద్ద‌రు పేస‌ర్ల‌ను మాత్ర‌మే ఎంపిక చేయ‌డం గ‌మనార్హం. స్పెషలిస్ట్ స్పిన్న‌ర్‌గా యుజ్వేంద్ర చాహల్ చోటు ద‌క్కించుకున్నాడు.

ఆకాశ్ చోప్రా ఎంపిక చేసిన ప్రత్యామ్నాయ భారత టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రజత్ పటిదార్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నమన్ ధీర్, కృనాల్ పాండ్యా, అనుకుల్ రాయ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)