Breaking News

సూర్యకుమార్‌ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

Published on Thu, 03/23/2023 - 08:26

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వన్డేల్లో తన చెత్త ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో మొదటి బంతికే ఔట్ అయిన సూర్యకుమార్ యాదవ్.. మూడు వన్టేల్లోనూ తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. చెన్నై వేదికగా జరిగిన మూడో వన్డేలో ఏడో స్ధానంలో బ్యాటింగ్‌ వచ్చిన సూర్య.. అష్టన్ అగర్‌ బౌలింగ్‌లో మొదటి బంతికే పెవిలియన్‌కు చేరాడు.

అగర్‌ వేసిన స్ట్రెయిట్ లెంగ్త్ బాల్‌కు బ్యాక్‌ఫుట్‌పై షాట్ ఆడేందుకు సూర్య  ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయి స్టంప్‌లను తాకింది. దీంతో ఖాతా తెరవకుండానే సూర్య నిరాశతో మైదానాన్ని వీడాడు.

అత్యంత చెత్త రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో గోల్డన్‌డక్‌గా వెనుదిరిగిన సూర్యకుమార్‌ యాదవ్‌ అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. ఓ వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటైన తొలి బ్యాటర్‌గా సూర్యకుమార్‌ నిలిచాడు. అదే విధంగా మూడు వన్డేల సిరీస్‌లో మూడు సార్లు డకౌట్ అయిన మొదటి భారత బ్యాటర్ కూడా సూర్యనే.  ఇక ఓవరాల్‌గా వన్డేల్లో వరుసగా మూడు సార్లు డకౌటైన ఆరో భారత బ్యాటర్‌గా సూర్య నిలిచాడు.

అంతకుముందు  సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వరుసగా మూడు డకౌట్‌లుగా వెనుదిరిగారు. కానీ వీరంతా తొలి బంతికే ఔట్‌ కాలేదు. అయితే ప్రపంచ క్రికెట్‌లో వరుసగా అత్యధిక డకౌట్‌లు అయిన రికార్డు మాత్రం శ్రీలంక దిగ్గజం లసిత్‌ మలింగ పేరిట ఉంది. వన్డేల్లో మలింగ వరుసగా నాలుగు సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.
చదవండి: IND vs AUS: అదే మా కొంప ముంచింది.. అస్సలు ఊహించలేదు! క్రెడిట్‌ మొత్తం వారికే

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)