Breaking News

సురుచి ధమాకా

Published on Thu, 04/17/2025 - 01:30

లిమా (పెరూ): గతవారం అర్జెంటీనాలో అదరగొట్టిన భారత టీనేజ్‌ పిస్టల్‌ షూటర్‌ సురుచి ఇందర్‌ సింగ్‌ అదే జోరును పెరూలో పునరావృతం చేసింది. అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌ రెండో టోర్నమెంట్‌లో హరియాణాకు చెందిన 18 ఏళ్ల సురుచి 24 గంటల వ్యవధిలో రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో సురుచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 

ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి 243.6 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని దక్కించుకుంది. సురుచి ధాటికి గత ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన భారత స్టార్‌ మనూ భాకర్‌ రజత పతకంతో సంతృప్తి పడింది. మనూ భాకర్‌ 242.3 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. 34 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో సురుచి 582 పాయింట్లతో రెండో స్థానంలో, మనూ భాకర్‌ 578 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. 

బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లోనూ సురుచి గరి అదిరింది. ఈ ఈవెంట్‌ ఫైనల్లో సురుచి–సౌరభ్‌ చౌధరీ (భారత్‌) ద్వయం విజేతగా నిలిచి పసిడి పతకాన్ని సాధించింది. ఫైనల్లో సురుచి–సౌరభ్‌ జోడీ 17–9తో కియాన్‌జున్‌ యావో–కాయ్‌ హు (చైనా) జంటను ఓడించింది. కాంస్య పతక మ్యాచ్‌లో మనూ భాకర్‌–రవీందర్‌ సింగ్‌ (భారత్‌) జోడీ 6–16తో కియాన్‌కె మా–యిఫాన్‌ జాంగ్‌ (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయింది.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)