Breaking News

రైనా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. టీ10 లీగ్‌లో ఆడనున్న మిస్టర్‌ ఐపీఎల్‌!

Published on Thu, 09/29/2022 - 12:38

టీమిండియా మాజీ ఆటగాడు సురేష్‌ రైనా ఇటీవలే అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటిలో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మరో వార్త సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.

అబుదాబి టీ10లీగ్‌లో రైనా పాల్గొనున్నాడన్నది ఆ వార్త సారంశం. అంతేకాకుండా ఈ టోర్నీలో దక్కన్‌ గ్లాడియేటర్స్‌ తరపున ఆడనున్నుట్లు అతడి అభిమానులు ట్విటర్‌ వేదికగా హల్‌చల్‌ చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని దైనిక్ జాగరణ్ కూడా తమ నివేదికలో పేర్కొంది.

" నేను ఇంకా రెండు, మూడు ఏళ్లు ఆడాలనుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్‌లో దేశీయ జట్టులో ప్రస్తుతం చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. నేను ఉత్తర్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ అసోషియషన్‌ నుంచి అనుమతి దృవీకరణ పత్రం కూడా పొందాను. విదేశీ లీగ్‌లలో ఆడేందకు సముఖత చూపిస్తున్నాను" అని రైనా పేర్కొన్నట్లు దైనిక్ జాగరణ్ వెల్లడించింది. కాగా  రైనా ప్రస్తుతం రోడ్‌సెప్టీ లీగ్‌లో ఆడుతున్నాడు.

ఈ ఈవెంట్‌లో మాస్టర్‌ బ్లస్టర్‌ సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్‌ జట్టులో భాగంగా ఉన్నాడు. ఇక ఇంతకుముందు అబుదాబి టీ10 లీగ్‌లోఅబుదాబి వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, ఎస్ బద్రీనాథ్, రీతీందర్ సింగ్ సోధి, మునాఫ్ పటేల్, యూసుఫ్ పఠాన్, ప్రవీణ్ కుమార్ వంటి భారత మాజీ ఆటగాళ్లు భాగమయ్యారు.
చదవండి: Ind Vs SA: అతడు అద్భుతమైన ఆటగాడు.. కానీ ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కలేదు.. అయినా: గంగూలీ

Videos

రాజ్ తో సమంత రిలేషన్‌ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!

అల్లు అర్జున్ తో నిహారిక లవ్ స్టోరీ

కమ్మేస్తోన్న కరోనా కాటేరమ్మ కొడుకునూ వదలని వైరస్

సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ

అందాల పోటీల మీదనే కాదు.. ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టాలి: కేటీఆర్

గుల్జార్ హౌస్ లో అసలేం జరిగింది?

YSRCP కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన టీడీపీ గూండాలు

ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

పాక్‌కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం

ఓటమి భయంతో YSRCP నేతలపై దాడి

Photos

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)

+5

కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

+5

కాజల్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఆ సినిమాతోనే స్టార్‌డమ్‌ (ఫొటోలు)

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు