Breaking News

సురేష్ రైనా సిక్సర్ల వర్షం.. దద్దరిల్లిన మైదానం(వీడియో)

Published on Sun, 10/06/2024 - 16:23

టీమిండియా మాజీ బ్యాట‌ర్ సురేష్ రైనా అంత‌ర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు నాలుగేళ్లు దాటిన‌ప్ప‌ట‌కి త‌నలో ఏ మాత్రం స‌త్తువ త‌గ్గ‌లేద‌ని మ‌రోసారి నిరూపించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న నేషనల్ క్రికెట్ టీ10 లీగ్‌లో రైనా విధ్వంసం సృష్టించాడు.

ఈ లీగ్‌లో న్యూయార్క్ లయన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రైనా.. శనివారం లాస్ ఏంజిల్స్ వేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌండరీల మోత మోగించాడు. తన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో అభిమానులను అలరించాడు.

ముఖ్యంగా బంగ్లాదేశ్ స్టార్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్‌ను మిస్టర్ ఐపీఎల్ ఓ ఆట ఆడేసికున్నాడు. షకీబ్ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో రైనా ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. దీంతో అతడు మరోసారి బౌలింగ్‌కు కూడా రాలేదు. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న రైనా.. 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

ఇక ఈ య్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ నిర్ణీత 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. రైనాతో పాటు ఉపుల్ తరంగా(40) పరుగులతో రాణించాడు. అనంతరం  లాస్ ఏంజిల్స్ 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 107 పరుగులకే పరిమితమైంది. దీంతో 20 ప‌రుగుల తేడాతో న్యూయ‌ర్క్ లయ‌న్స్ విజ‌యం సాధించింది.


 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)