Breaking News

అదే మా కొంప‌ముంచింది.. వీలైనంత త్వరగా మర్చిపోవాలి: కమ్మిన్స్‌

Published on Tue, 05/21/2024 - 23:36

హైద‌రాబాద్ 8 వికెట్ల తేడాతో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎస్ఆర్‌హెచ్ విఫ‌ల‌మైంది. తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్‌ఆర్‌హెచ్‌ ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో రాహుల్‌ త్రిపాఠి(55) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌(32), కమ్మిన్స్‌(30) పరుగులతో రాణించారు. 

కేకేఆర్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి రెండు , రస్సెల్‌,నరైన్‌,  హర్షిత్‌ రనా, ఆరోరా తలా వికెట్‌ సాధించారు. అనంత‌రం 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేకేఆర్ ఊదిప‌డేసింది.  కేకేఆర్ 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. 

కేఆర్‌ బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌(24 బంతుల్లో 58 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్‌ అయ్యర్‌(51 నాటౌట్‌), గుర్భాజ్‌(23) పరుగులతో రాణించారు. ఇక క్వాలిఫ‌య‌ర్1లో ఓట‌మి పాలైన  ఎస్ఆర్‌హెచ్ ఫైన‌ల్ చేరేందుకు మ‌రో అవ‌కాశం మిగిలి ఉంది.

 మే 24న జ‌ర‌గనున్న క్వాలిఫ‌య‌ర్‌-2లో ఆర్సీబీ లేదా రాజ‌స్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇక ఈ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ స్పందించాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో విఫలమయ్యాని కమ్మిన్స్ తెలిపాడు.

మా ఓటమికి కారణమిదే: కమ్మిన్స్‌
"ఈ ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే మా​కు ఇంకా ఫైనల్స్‌కు చేరేందుకు ఛాన్స్‌ ఉంది. సెకెండ్‌ క్వాలిఫయర్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము.

ప్రస్తుత టీ20 క్రికెట్‌లో ఏ రోజు ఏమి జరుగుతుందో అంచనా వేయలేం. మేము ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో, అనంతరం బౌలింగ్‌లో కూడా రాణించలేకపోయాము. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఉపయోగించాలని నిర్ణయించాం. అందుకే సన్వీర్‌కు ఛాన్ప్‌ ఇచ్చాం. 

కానీ మా ప్లాన్‌ బెడిసి కొట్టింది. కానీ కేకేఆర్‌ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. ప్రారంభంలో పిచ్‌ బౌలర్లకు కాస్త అనుకూలించింది. కానీ తర్వాత మాత్రం పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించింది. 

ఇక క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ చెన్నైలో ఆడనున్నాం. చెన్నె వికెట్‌ మాకు సరిగ్గా సరిపోతుందని నేను భావిస్తున్నారు. కాబట్టి ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉందంటూ" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.

 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు