అభిషేక్ సూప‌ర్ సెంచ‌రీ.. పంజాబ్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్‌

Published on Sat, 04/12/2025 - 23:44

ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్ నిర్ధేశించిన 246 పరుగుల భారీ టార్గెట్‌ను సన్‌రైజర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవ‌ర్ల‌లో చేధించింది.

స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ శ‌ర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ పంజాబీ బ్యాటర్‌ ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు.కేవ‌లం 55 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న అభిషేక్‌.. 14 ఫోర్లు, 10 సిక్స్‌ల‌తో 141 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అతడితో పాటు ‍ట్రావిస్ హెడ్‌(37 బంతుల్లో 66) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్‌, చాహల్ తలా వికెట్ సాధించారు. కాగా ఐపీఎల్ చరిత్రలో రెండువ అత్యధిక స్కోర్ ఛేజ్ చేసిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది.

అయ్యర్ విధ్వంసం..
ఇక  ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కిం‍గ్స్ కూడా భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌(42), ఆర్య(36), స్టోయినిష్‌(11 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఎషాన్ మలింగ రెండు వికెట్లు సాధించాడు.
చ‌ద‌వండి: IPL 2025: మ‌హ్మ‌ద్ ష‌మీ అత్యంత చెత్త రికార్డు..

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)