Breaking News

చ‌రిత్ర సృష్టించిన సునీల్ నరైన్‌..

Published on Fri, 04/04/2025 - 17:56

ఐపీఎల్‌-2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తిరిగి విన్నింగ్ ట్రాక్‌లోకి వచ్చింది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 201 పరుగుల భారీ లక్ష్య చేధనలో కేకేఆర్ చతకలపడింది. కేకేఆర్ బౌలర్ల దాటికి సన్‌రైజర్స్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్‌ అయింది. 

ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్‌ క్లాసెన్‌ (21 బంతుల్లో 33) టాప్ స్కోరర్‌గా నిలవగా..  కమిందు మెండిస్‌ (20 బంతుల్లో 27), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (19) కాసేపు క్రీజులో నిలదొక్కుకున్నారు. కేకేఆర్‌ బౌలర్లలో పేసర్‌ వైభవ్‌ అరోరా, వరుణ్ చక్రవర్తి తలా మూడు వికెట్లు పడగొట్టి ఎస్‌ఆర్‌హెచ్ పతనాన్ని శాసించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది.

నరైన్ అరుదైన రికార్డు..
ఈ మ్యాచ్‌లో కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కేకేఆర్ తరపున తన 200వ వికెట్‌ను నరైన్ అందుకున్నాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో ఒకే జట్టు తరపున అత్యధిక వికెట్లు సాధించిన రెండో ప్లేయర్‌గా నరైన్ నిలిచాడు.

సునీల్ నరైన్ ఐపీఎల్ ఆరంభం నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కే ఆడుతున్నారు. సునీల్‌ కేకేఆర్ తరుపన ఇప్పటివరకు ఐపీఎల్‌లో 182 , ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20)లో 18 వికెట్లు తీశాడు. మొత్తంగా 200 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ క్రికెట్ క్లబ్ నాటింగ్‌హామ్‌షైర్ బౌలర్ సమిత్ పటేల్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 

ఇప్పటివరకు  నాటింగ్‌హామ్‌షైర్ తరపున పటేల్ 208 వికెట్లు పడగొట్టాడు. పటేల్‌, నరైన్ తర్వాతి స్ధానంలో హాంప్‌షైర్ బౌలర్ క్రిస్ వుడ్ 199 ఉన్నాడు. ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగ 195 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)