Breaking News

సాకులు చెప్పడంలో మన దేశం బంగారు పతకాలు సాధిస్తుంది..!

Published on Tue, 08/13/2024 - 18:42

భారత బ్యాడ్మింటన్ బృందం 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా గెలవలేకపోయింది. లక్ష్య సేన్ పతకం దగ్గరికి వచ్చినప్పటికీ లీ జి జియాతో జరిగిన కాంస్య పతక పోరులో ఓటమిపాలయ్యాడు. భారత షట్లర్ల పేలవ ప్రదర్శన పట్ల బ్యాడ్మింటన్ కోచ్ ప్రకాష్ పదుకొణే తీవ్ర నిరాశకు గురయ్యాడు. భారత  షటర్ల ఆటతీరును బహిరంగంగా దుయ్యబట్టాడు. ప్రకాశ్‌ వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. అశ్విని పొన్నప్ప ఆవేశపూరిత సమాధానంతో ముందుకు వచ్చారు. అయితే ప్రకాశ్‌ పదుకొణెకు భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. 

స్పోర్ట్‌స్టార్ కోసం రాసిన కాలమ్‌లో గవాస్కర్‌ ఇలా రాసుకొచ్చాడు. సాకులు చెప్పడం మన ఆటగాళ్లకు అలవాటుగా మారిందని అర్దం వచ్చేలా కామెంట్స్‌ చేశాడు. సాకులు చెప్పడంలో మన దేశం (షట్లర్లను ఉద్దేశిస్తూ) బంగారు పతకాలు సాధిస్తుంది ఎద్దేవా చేశాడు. ప్రకాశ్‌ బాధలో నిజాయితీ ఉందని, ఇందులో అతన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని అన్నాడు. ఆటగాళ్లకు ప్రభుత్వం నుంచి చాలా మద్దతు ఉందని, ఓటములకు ఆటగాళ్లు బాధ్యత వహించాలని ప్రకాశ్‌ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా, ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత షట్లర్ల శిక్షణ నిమిత్తం కోట్ల రూపాయల ఖర్చు చేశారన్న అంశంపై ప్రస్తుతం క్రీడా వర్గాల్లో దూమారం రేగుతున్న విషయం తెలిసిందే.

 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)