Breaking News

ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్‌! ప్రతీసారి ఇంతే

Published on Fri, 04/07/2023 - 13:01

ఐపీఎల్‌-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు మన్‌దీప్‌ సింగ్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. పంజాబ్‌ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన మన్‌దీప్‌.. ఇప్పుడు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా మన్‌దీప్‌(15) రికార్డులకెక్కాడు.దీంతో అతడి ఆటతీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.

                                                 

ఈ క్రమంలో మన్‌దీప్ ఆటతీరుపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ప్రతీ ఐపీఎల్‌ సీజన్‌లో ఎదోక జట్టులో మన్‌దీప్‌ ఉంటాడని, అయితే తన స్థానానికి మాత్రం ఎటువంటి న్యాయం చేయడని గవాస్కర్ విమర్శించాడు. అతడు ఔటైన సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న గవాస్కర్ మాట్లాడుతూ.. ప్రతీ సారి అతడిని ఏదో ఒక ప్రాంఛైజీ కొనుగొలు చేస్తుంది.

కానీ అతడి మాత్రం తనకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. బహుశా అతడు వచ్చే సీజన్‌కు కేకేఆర్‌ విడిచిపెట్టే అవకాశం ఉంది అని పేర్కొన్నాడు. మరోవైపు నెటిజన్లు సైతం మన్‌దీప్‌ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు.  ఐపీఎల్‌కు ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్‌ అంటూ ట్రోలు చేస్తున్నారు.
చదవండి: రోహిత్‌, కోహ్లి, రాహుల్‌కే ఛాన్స్‌లు ఇస్తారా.. అతడు ఏం పాపం చేశాడు మరి?

Videos

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట

అతి దారుణంగా కారణం ఇదేన బస్సు స్టాండ్ లో..! పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)