అప్పుడు స్టుపిడ్.. స్టుపిడ్! ఇప్పుడు సూపర్బ్.. సూపర్బ్

Published on Sat, 06/21/2025 - 20:46

స్టుపిడ్‌..స్టుపిడ్‌.. స్టుపిడ్‌.. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ కోల్పోవ‌డంతో కామెంటేట‌ర్‌ సునీల్ గ‌వాస్క‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ఇవి. ఇప్పుడు అదే గ‌వాస్క‌ర్ రిష‌బ్ పంత్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు. లీడ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో పంత్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు.

రెండో రోజు ఆట‌లో త‌న ఏడో టెస్టు సెంచ‌రీ మార్క్‌ను రిష‌బ్ అందుకున్నాడు. ఈ ఢిల్లీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్  99 పరుగుల వద్ద సిక్సర్ బాది మరి త‌న సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో కామెంట‌రీ బాక్స్‌లో ఉన్న గ‌వాస్క‌ర్ సూపర్బ్.. సూపర్బ్.. సూపర్బ్ అంటూ కొనియాడాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. విమ‌ర్శించిన నోళ్ల‌తోనే పొగిడించుకోవ‌డం చాలా గ్రేట్ అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఓవ‌రాల్‌గా 178 బంతులు ఎదుర్కొన్న పంత్‌.. 12 ఫోర్లు, 6 భారీ సిక్స‌ర్ల‌తో 134 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఈ సెంచరీతో టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్‌ కీపర్‌గా ధోని రికార్డును పంత్‌ బ్రేక్‌ చేశాడు. పంత్‌కు ఇది ఏడో టెస్టు సెంచరీ.

తొలి ఇన్నింగ్స్‌లో భార‌త స్కోరంతంటే?
ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 471 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 359/3 ఓవ‌ర్ నైట్‌స్కోర్‌తో రెండో రోజు ఆట‌ను ఆరంభించిన టీమిండియా అద‌నంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రిష‌బ్ పంత్‌తో పాటు కెప్టెన్‌ శుబ్‌మ‌న్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్‌), య‌శ‌స్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచ‌రీల‌తో చెల‌రేగారు.

ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో  కెప్టెన్ బెన్‌స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయ‌క్ బ‌షీర్ చెరో వికెట్ సాధించారు. అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి వికెట్ న‌ష్టానికి 72 ప‌రుగులు చేసింది.
చదవండి: IND vs ENG: రిష‌బ్ పంత్ వ‌ర‌ల్డ్ రికార్డు..
 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)